Advertisement
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలలో బాలకృష్ణ కూడా ఒకరు. అన్నగారు నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే బాలకృష్ణ అంటే యాక్షన్ సినిమాలే చాలామందికి తెలుసు. ఆయన సినీ కెరీర్లో ఎక్కువ నటించిన సినిమాలు కూడా యాక్షన్ సినిమాలే.
Advertisement
అలాంటి మాస్ హీరో ఒక్కసారిగా క్లాస్ సినిమాలు చేస్తే ఎలా ఉంటుంది. ప్రేక్షకులు ఆదరిస్తారా అనే భావనకు బ్రాండ్ అంబాసిడర్ బాలక్రిష్ణ. మాస్ ఇమేజ్ ఉన్న ఆయన ఆదిత్య 369, భైరవద్వీపం వంటి సినిమాలు చేసి సెన్సేషనల్ హిట్ అందుకున్నారు.
ఆదిత్య 369 సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు పాత్రను మరియు మరో వైపు కృష్ణా అనే యువకుడి పాత్రలో నటించడమే కాదు జీవించేశారు.అప్పట్లోనే భవిష్యత్తును చూడగల టైం మెషిన్ లో టైం ట్రావెల్ వంటి కాన్సెప్టుతో సినిమా రావడం ఒక సాహసమే అని చెప్పవచ్చు. దీనికి మాస్ ఇమేజ్ వున్న బాలకృష్ణ ఒప్పుకోవడం మరో సాహసం గా చెప్పవచ్చు.. ఇదంతా బాగానే ఉన్నా ఆదిత్య 369 సినిమా అందరం చూసే ఉంటాం. సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. అయితే తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న సింగీతం శ్రీనివాసరావు, ఆదిత్య 369 సినిమాను బాలకృష్ణ తోనే ఎందుకు తీశారు? ‘ఆదిత్య 369’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? ఈ సినిమాను చూసిన నాసా ఏమని ప్రశంసించింది? ఈ చిత్రం సీక్వెల్, వంటి విషయాలు గురించి మాట్లాడారు.
Advertisement
” బాలకృష్ణ తో మూడు చిత్రాలు చేశాను. ఆదిత్య 369 విషయానికొస్తే, భవిష్యత్, వర్తమానం ఎవరైనా చేస్తారు. గతంలోకి వెళ్లాలంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకోవాలి. ఓ కథగా, జనరంజికంగా ఉండాలంటే రెండే రెండు కాలాలు ఉన్నాయి. ఒకటి శ్రీకృష్ణదేవరాయలు, అక్బర్ కథ. ఇలాంటి కథలు బాలకృష్ణ అయితేనే కరెక్ట్. అలా శ్రీకృష్ణదేవరాయలను ఎంచుకుని బాలకృష్ణను తీసుకున్నాను” అని సింగీతం అన్నారు. నాసా ప్రశంసలు, “ఇక్కడి వాళ్లు నాసాలో ఉన్నారు. ప్రపంచంలోనే ఉన్న టైమ్ మెషిన్ సినిమాలన్నింటినీ చూశారు. అందులో ఆదిత్య 369 అనేది పర్ఫెక్ట్ టైమ్ మెషిన్ అని కితాబ్ ఇచ్చారు. నాకు కాలేజీ డేస్ నుంచి సైన్స్ ఫిక్షన్ అంటే ఇంట్రెస్ట్. కానీ సైన్స్, టెక్నాలజీ అంతా తెలిసి చేయలేదు. కానీ బాగా వచ్చింది. అందుకే వాళ్ళు నన్ను ప్రశంసించారు” అని సింగీతం పేర్కొన్నారు.