Advertisement
సినిమా ఇండస్ట్రీ అంటేనే జనరేషన్ కు తగ్గట్టు సినిమాలు కథలు, నటులు మారితేనే ఇండస్ట్రీ ఎదుగుతుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి కొంతమంది ఏదో చిన్న నటుడు అవుదామని వచ్చి చివరికి స్టార్ నటులుగా ఎదిగిన వారు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా హీరో గా ఎంట్రీ ఇచ్చి విలన్ గా మారిన నటులు ఎంతో మంది. కానీ విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారిన నటులు ఇండస్ట్రీలో అతికొద్ది మంది మాత్రమే.. మరి వారు ఎవరు అనేది మనం ఇప్పుడు చూద్దాం.
చిరంజీవి:
Advertisement
మెగాస్టార్ చిరంజీవి ముందుగా సినిమా ఇండస్ట్రీకి విలన్ లా ఎంట్రీ ఇచ్చారు. మోసగాడు, ఇది కథ కాదు వంటి సినిమాల్లో విలన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆయన చూసి హీరోగా అవకాశం రావడంతో ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఎదిగారు.
also read: గణేశున్ని 10 రోజుల పూజల తర్వాత నిమజ్జనం చేయడం వెనుక ఇంత కథ ఉందా..?
మోహన్ బాబు :
Advertisement
డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్నటువంటి మోహన్ బాబు స్వర్గం నరకం అనే మూవీ తో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈయన ముందుగా విలన్ గా గుర్తింపు తెచ్చిన తరువాత హీరో అవకాశం రావడంతో స్టార్ హీరోగా ఎదిగారు.
గోపీచంద్ :
గోపీచంద్ నితిన్ హీరోగా వచ్చిన జయం సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టారు. దీంతో మంచి గుర్తింపు సాధించడంతో, హీరోగా అనేక అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు గోపీచంద్.
రాజశేఖర్:
ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే ముందు తలంబ్రాలు అనే సినిమాలో విలన్ గా చేశారు. ఈ సినిమాకు నంది అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత హీరోగా రాణించి సక్సెస్ఫుల్ అయ్యారు.
జె డి చక్రవర్తి :
ఈ నటుడు కూడా ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చే ముందు విలన్ పాత్రలో నటించారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో హీరోగా మరియు విలన్ గా ఎదిగారు.
also read:దేవి శ్రీ ప్రసాద్ ఆ హీరోయిన్ మధ్య లవ్.. పెళ్లెప్పుడంటే..?