Advertisement
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు రెండో తనయుడు మంచు మనోజ్…. గత ఆదివారం సీతాఫల్ మండిలోని తన స్నేహితుడు రవి ఏర్పాటు చేసిన గణేష్ మండపానికి స్వర్గీయ భూమా నాగిరెడ్డి కూతురు మౌనికతో హాజరయ్యాడు. ఇది చాలామందికి షాక్ ఇచ్చిన మాట నిజమే. మనోజ్, మౌనిక ప్రేమలో ఉన్నారన్న వార్త రెండు రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ ఇలా బాహటంగా రావడం ఇదే మొదటిసారి కావటం అటు మనోళ్లు తల్లిదండ్రులను కూడా ఆశ్చర్యపరిచిందట.
Advertisement
ఇవి కూడా చదవండి: ఇండస్ట్రీలోకి విలన్ గా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన 5గురు స్టార్లు.. వీరిలో ఆ ఒక్క పాయింట్ గమనించారా..?
Advertisement
అయితే మనోజ్, మౌనికల ప్రేమ నిన్న మొన్నటిది కాదని కొందరు సన్నిహితులు అంటున్నారు. మనోజ్ మూడేళ్ల క్రితం మౌనికని చెన్నైలో కలిశారని, అప్పటి నుంచి ఇద్దరు టచ్ లో ఉన్నారని చెప్పుకుంటున్నారు. మొదట్లో ఇద్దరు మంచి స్నేహితులుగానే ఉన్నారని, తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని అంటున్నారు. మనోజ్ కి మౌనిక చాలా కాలంగా తెలిసిన గత మూడేళ్ల నుండే ప్రేమలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
స్నేహితుల ఇంట్లో ఇద్దరు కలుసుకునే వారని, బయటకి ఎక్కువగా రాలేదని ఆదివారం మాత్రమే ఇద్దరూ కలిసి బయటికి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారని అంటున్నారు. సీతాఫల్ మండిలో ఉంటున్న రవి, మనోజ్ కి స్నేహితుడని అతని ఆహ్వానం మేరకు మనోజ్ అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే కావాలనే కొంతమంది ముందుగా మీడియాకు లీక్ చేశారని సమాచారం. మంచు కుటుంబం వీరిద్దరి వివాహం గురించి ఒక ప్రకటన విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
Read also : బాలయ్య “ఆదిత్య 369” పై నాసా ప్రశంసలు