Advertisement
మనం మన దగ్గర ఉండే మొబైల్ కానీ కంప్యూటర్ ద్వారా గాని డేటా సేవ్ చేసుకోవడానికి యూఎస్బీ కేబుల్ అనేది ఉపయోగిస్తాం. ఏదైనా ఇంపార్టెంట్ విషయాలకు సంబంధించి అందులో స్టోర్ చేసుకొని ఉంచుకుంటాం. కామన్ గా ఫొటోస్, ఇతరత్రా ఏదైనా సబ్జెక్ట్ విషయంలో సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేసి పెట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా యూఎస్బిని కంప్యూటర్ ద్వారా కనెక్ట్ చేసుకుని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా మనం యూఎస్బీ కేబుల్ ను గమనించినప్పుడు దాని పై భాగంలో రెండు హోల్స్ ఉంటాయి.
Advertisement
Advertisement
అయితే ఇవి డిజైన్ కోసం అని మనం అనుకుంటాం. కానీ హోల్స్ డిజైన్ కోసం కాదు. వీటివల్ల చిన్న యూజ్ ఉంది. యుఎస్బి కేబుల్ ని డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటారు. ఒక డివైస్ నుంచి మరొక డివైస్ కు డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ కేబుల్ చాలా ఉపయోగపడుతుంది. మనం డేటా పంపేటప్పుడు ఆ కేబుల్ స్టేబుల్ గా ఉండాలి. దాని కనెక్షన్ లూజ్ గా ఉంటే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. యూఎస్బీ లో రెండు రకాలు ఉంటాయి.
మేల్ యు ఎస్ బి, ఫిమేల్ యుఎస్బి. మనం ఇప్పుడు మాట్లాడుకునేది మేల్ యు ఎస్ బి పోర్ట్. దీనిపైన రెండు హోల్స్ ఉంటాయి. అలాగే ఫిమేల్ యూఎస్బి పోర్ట్ కి రెండు కట్స్ ఉంటాయి. అవి లోపలికి బెండ్ అయి ఉంటాయి. మేల్ యూఎస్బీ పోర్ట్ ని ఫిమేల్ యూఎస్ బి పోర్ట్ కి ఇంజెక్ట్ చేసినప్పుడు కరెక్ట్ గా ఫిక్స్ అవుతుంది. అలాగే డేటా ట్రాన్స్ఫర్ కూడా స్మూత్ గా జరుగుతుంది. అందుకే యూఎస్బీ కేబుల్ పై రెండు హోల్స్ అనేవి పెడతారు.