Advertisement
Oke Oka Jeevitham Review: శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఒకే ఒక జీవితం’. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, అమల అక్కినేని, నాజర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించిన ఈ సినిమాని శ్రీ కార్తీక్ తెరకెక్కించారు. ఈరోజు విడుదల అయిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
Advertisement
Oke Oka Jeevitham Movie Review and Rating
కథ&విశ్లేషణ:
ఆది (శర్వానంద్) చిన్నప్పుడే తల్లిని కోల్పోతాడు. అతనికి తల్లి అన్న, సంగీతం అన్న చాలా ఇష్టం. సంగీతం అంటే ఇష్టము కానీ అందరిలో పాడాలంటే మాత్రం చాలా బెరుకు. మరోపక్క చైతన్య (ప్రియదర్శి) ఎలా అయినా తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని భావిస్తూ ఉంటాడు. అయితే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల అనేక సంబంధాలను తానే రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. చివరికి పెళ్లిచూపుల్లో ఒక అమ్మాయి నచ్చుతుంది. కానీ సరిగ్గా ఆ సమయంలోనే చిన్నప్పుడు తాను వద్దనుకున్న తన స్కూల్ ఫ్రెండ్ ఫోటో చూసి ఆమెను ఎలా మిస్ చేసుకున్నాను అని బాధపడుతూ ఉంటాడు. మరోపక్క శ్రీనివాస్ (వెన్నెల కిషోర్) చదువు సరిగ్గా చదువుకోకపోవడంతో ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా స్థిరపడతాడు. అద్దె ఇల్లు చూసి పెడుతూ ఉంటాడు.
Advertisement
శ్రీనివాస్ అనుకోకుండా పాల్ (నాజర్) అని ఒక సైంటిస్ట్ కి ఒక ఇల్లు అద్దెకు ఇప్పిస్తాడు. అలా ఇప్పించిన సమయంలోనే పాల్ ఇచ్చిన ఒక ఆఫర్ తో ఈ ముగ్గురు టైం డ్రైవల్ చేసేందుకు సిద్ధమవుతారు. పాల్ పుణ్యమా అని సుమారు 20 ఏళ్లు వెనక్కి వెళ్తారు. వెనక్కి వెళ్లిన తర్వాత వీధిని మార్చడానికి ప్రయత్నిస్తారు. ఈ ముగ్గురు కలిసి విధిని మార్చారా? తర్వాత ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ మధ్యకాలంలో చాలా టైం ట్రావెల్ సినిమాలు వచ్చాయి. అయితే ఇది ఒక ఎమోషనల్ టైం ట్రావెల్ కాన్సెప్ట్ అన్నట్లుగా ఉంది. దర్శకుడు శ్రీ కార్తీక్ యొక్క ప్రతిభను మెచ్చుకోవాల్సిందే. శర్వానంద్ కి ఈ సినిమాతో చాలాకాలం తర్వాత ఫ్లాప్ లా పరంపరకి బ్రేక్ పడ్డట్లు అయింది. శర్వానంద్ కి మంచి కథ పడితే నటన విషయంలో ఆయనను అడ్డుకునే వారే ఉండరు. ఈ సినిమాలో అదే నిరూపితం అయింది.
ప్లస్ పాయింట్స్ :
కథ, కాన్సెప్ట్
దర్శకత్వం, స్క్రీన్ ప్లే,
ఎమోషనల్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్ :
కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా ఉన్నాయి.
అక్కడక్కడ నాచురాలిటీ మిస్ అయింది.
రేటింగ్: 3/5.
Read also: లైగర్ తరహాలో IMDB రేటింగ్ తక్కువ సాధించిన సినిమాల వివరాలు !