Advertisement
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి సెల్ఫోన్ ఉంది.. అందులో ఏదో ఒక కంపెనీకి చెందిన సిమ్ కూడా ఉంటుంది.. ఏ కంపెనీకి చెందినది అయినా సరే దాంట్లో పది అంకెల నెంబర్లు తప్పనిసరిగా ఉంటాయి.. మరి ఆ పది అంకెలు ఎందుకు ఉండాలి తొమ్మిది లేదా పదకొండు లేదా పదిహేను ఉండవచ్చు కదా అని చాలామందికి డౌట్ వచ్చి ఉండవచ్చు.. మరి అలా ఉండటానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి.. అవేంటో మనం చూద్దాం..
Advertisement
also read: హీరో దుల్కర్ సల్మాన్ భార్యకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో మీకు తెలుసా..!!
Advertisement
అయితే భారతదేశంలో 10 అంకెల ఫోన్ నెంబర్ ఉండడానికి కారణం పెరుగుతున్న జనాభా.. జాతీయ నెంబర్ పథకం ప్రకారం జీరో నుంచి 9 అంకెలతో ఫోన్ నెంబర్ ఒక డిజిట్ మాత్రమే ఉంటే కేవలం 9 ఫోన్ నెంబర్లు మాత్రమే తయారు చేయగలం.. అదేవిధంగా జీరో నుంచి 99 వరకు ఉంటే కేవలం 99 ఫోన్ నెంబర్లు మాత్రమే తయారు చేయవచ్చు.. మనదేశంలో పెరుగుతున్న జనాభా దృష్టిలో పెట్టుకొని ఈ నెంబర్లను పది అంకెలుగా మార్చారు. ఈ ఫోన్ నెంబర్ 10 అంకెలు ఉంటే చాలా రకాల నెంబర్లు తయారు చేయవచ్చు.. దీని వల్ల జనాభా పెరిగిన భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది.
ఈ క్రమంలోనే 2003వ సంవత్సరం వరకు కేవలం తొమ్మిది అంకెలు ఉన్న ఫోన్ నెంబర్ ప్రస్తుతం పది అంకెలుగా మారింది. టెలికాం రెగ్యులేటరీ అతారిటీ ఆఫ్ ఇండియా వారు ఏదైనా ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేయడానికి ముందు ఫోన్ నెంబర్ ముందు జీరో యాడ్ చేసి డయల్ చేయాలని చెప్పింది.. కేవలం ఈ మార్పు వల్ల 2544 మిలియన్ అదనపు నెంబర్లను తయారు చేసే అవకాశం ఉంటుందని చెప్పింది.
also read:ఆ నటుడితో భార్యగా, చెల్లిగా, కూతురుగా నటించిన రమ్యకృష్ణ..ఆయన ఎవరో తెలుసా..?