Advertisement
తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన సౌందర్య అప్పట్లో స్టార్ హీరోలను సైతం పక్కకునెట్టి తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అచ్చ తెలుగు అమ్మాయిల తన అందం, అభినయంతో తెలుగువారి గుండెల్లో స్థానం సంపాదించుకుంది. స్టార్ హీరోలందరితో నటించిన సౌందర్య ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే గొప్ప స్థానానికి ఎదిగింది.. కానీ విధి ఆమెను బలితీసుకుంది.. హెలికాప్టర్ ప్రమాదంలో కానరాని లోకాలకు వెళ్ళింది.. దీంతో ప్రేక్షకులందరినీ శోకసంద్రంలో ముంచేసింది.
Advertisement
also read:Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 09.09.2022
Advertisement
ఇప్పటికీ సౌందర్య సినిమాలు టీవి లో వస్తే చాలా మంది చూసి బాధపడుతూ ఉంటారు. ఆమె 2004లో ఒక రాజకీయ పార్టీ ప్రచారం కోసం విమానంలో వెళుతున్న సందర్భంలో ప్రమాదం జరిగి సౌందర్య మరియు అతని సోదరుడు మృతిచెందారు. అయితే సౌందర్య సావిత్రి తర్వాత అంతటి ఆదరణ సంపాదించిన హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.. అలాంటి సౌందర్య ముఖాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేక పోతున్నారు.. ఈ తరుణంలోనే సోషల్ మీడియాలో అచ్చం సౌందర్యను పోలిన ఒక యువతి యూట్యూబ్ వీడియో షార్ట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
సౌందర్య ముఖకదలికలకు ఏ మాత్రం తగ్గని పోలికలతో అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది. ఈ అమ్మాయిని చూస్తే మళ్లీ సౌందర్య పుట్టిందా అనే అనుమానాలు కూడా వస్తాయి.. అయితే ఈ జూనియర్ సౌందర్య ఇప్పటికి ఎంతో మంది ఫాలోవర్స్ ను సంపాదించుకొని నెటిజన్ల కు మరింత దగ్గర అవుతోంది.. అయితే ఈమె తనకు సినిమా అవకాశాలు వస్తే మాత్రం తప్పకుండా చేస్తానని అంటోంది.