Advertisement
టాలీవుడ్ దిగ్గజ నటుడు కృష్ణంరాజు కన్నుమూయడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే కృష్ణంరాజు మృతి నేపథ్యంలో ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా కృష్ణంరాజుకు ప్రభాస్ అంటే ఎంతో ప్రేమ.
Advertisement
తనకు కొడుకులు లేకపోవడంతో తమ్ముడి కొడుకు అయినా ప్రభాస్ ను తన సొంత కొడుకులా చూసుకునేవారు. ప్రభాస్ తో కలిసిన నటించేందుకు రెబల్ స్టార్ మక్కువ చూపేవారు. ఈ క్రమంలో ఇద్దరు వెండితెరపై బిల్లా, రెబల్, రాదేశ్యామ్ చిత్రాల్లో కలిసి యంగ్ రెబల్ స్టార్ తో కలిసి కృష్ణంరాజు నటించారు. అయితే టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ప్రభాస్ ఒకరు.
Advertisement
చాలా సార్లు ప్రభాస్ పెళ్లి గురించి వార్తలు వచ్చిన అవేవీ నిజం కాలేదు. ప్రభాస్ ఎదుగుదలను చూసిన కృష్ణంరాజు పెళ్లిని మాత్రం కల్లారా చూడలేకపోయారు. ప్రభాస్ పెళ్లి గురించి ఆయన ఆరాటపడ్డారు. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని ఆశపడ్డార. ప్రభాస్ పెళ్లి జరిగి, పిల్లలు పుడితే వారితో నటించాలని ఎంతో ఆసక్తిగా ఉందంటూ తన మనసులో మాటను ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అలాగే మన ఊరి పాండవులు లాంటి చిత్రంలో ప్రభాస్ నటిస్తే చూడాలని ఉందని కోరికను బయటపెట్టారు. కానీ కృష్ణంరాజు తన కోరికలు తీరకుండా తుదిశ్వాస విడిచారు.
READ ALSO : రిలయన్స్ అధినేత అంబానీ ఆస్తుల్లో విలాసవంతమైన వస్తువులు ఇవే