Advertisement
ఐదు దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 సెప్టెంబర్ 8 న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ వార్త ఆ దేశ ప్రజలనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తీవ్ర భావోద్వేగానికి గురి చేసింది. రాణి ఎలిజబెత్ మరణ వార్తను బ్రిటిష్ ఎయిర్ వేస్ పైలట్ మిడ్ ఫ్లైట్ లో ప్రకటించారు. ఎలిజబెత్-2 సంపూర్ణ జీవితం అనుభవించి 96 ఏళ్ల వయసులో మరణించారు. ఇన్ని రోజులు ఆమె బతికింది అంటే దానికి కారణం ఆమె ఆహారపు అలవాట్లేనట.
Advertisement
ఎలిజబెత్-2 ఏం తినేవారు తెలుసా?
మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత (1914-1918) రాణి ఎలిజబెత్ జన్మించింది.రెండో ప్రపంచ యుద్ధ సమయంలో టీనేజ్ లో ఉన్న ఎలిజబెత్ అందరిలాగే సాధారణ భోజనం చేశారు. ఫరీదాబాద్ లోని అకార్డు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ హెడ్ అయిన డాక్టర్ జయంత ఠాకూరియా మాట్లాడుతూ ఇంట్లో వండిన ఆహారం తినేవారిలో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటుంది. అంటే ఇంటి భోజనం చేసేవారు వ్యాధుల బారిన తక్కువగా పడుతుంటారు. శరీర ఆరోగ్యంగా ఉండేవారు ఎక్కువ కాలం జీవిస్తారు. విదేశాల్లో నివసించే వారిలో చాలామంది చేపలు, చికెన్, టర్కీ కోడి, మాంసం వంటి ఆహారాలను తింటుంటారు.
Advertisement
ఆలివ్ ఆయిల్ తో వండిన ఆహారాన్ని తింటారు. అలాగే సలాడ్స్, పండ్లు వారి భోజనాల్లో ప్రధాన భాగంగా ఉంటాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా వారు ఉప్పు చాలా తక్కువ పరిమాణంలో తీసుకుంటారు. ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలో విషపూరితమవుతుంది. అందుకే ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలి. కడుపులోని పేగులకు హాని తలపెట్టే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. జీవితంలో ఏ దశలోనున్న వారైనా ఈ చిన్న మార్పులు చేసుకుంటే వారి జీవితకాలం పొడిగించడం అసాధ్యం కానే కాదు. అలాగే శారీరక వ్యాయామం కూడా అంతే ముఖ్యం. కండలు పెంచేంత చేయనవసరం లేదు. కేవలం వారానికి ఐదు రోజులు వాకింగ్, స్విమ్మింగ్, స్ట్రెచింగ్, వ్యాయామాలు వంటి సాధారణ నియమాలు పాటిస్తే చాలు. రాజ కుటుంబీకులు భోజనంతో పాటు ఒక గ్లాసు వైన్ కూడా తాగుతారు. ఎలిజబెత్ ఉదయం ఒక జిన్ కాక్ టెయిల్ ను తీసుకుంటారు. ఆ తర్వాత భోజనంతో పాటు గ్లాస్ వైన్ లేదా షాంపైన్, సాయంత్రం మరో గ్లాస్ శాంపైన్ డ్రై మార్టిని సేవిస్తారు. నిజానికి రోజు ఒక గ్లాస్ వైన్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. 3-4 గ్లాసులు తాగితే మాత్రం ఆరోగ్యానికి తీవ్ర హాని తలపెడుతుంది. అదేవిధంగా స్మోకింగ్ కూడా చేయకూడదు. ఈ రెండు అలవాట్లు లేని వారు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవిస్తారని డాక్టర్ జయంత ఠాకూరియా తెలిపారు.
Read also : అర్థాంతరంగా ముగిసిపోతుందనుకున్న.. కృష్ణంరాజు కెరీర్ ను కాపాడింది ఆయనే !