Advertisement
టాలీవుడ్ చిత్రం పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్, యాక్షన్ మరియు థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల సినిమాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మన ముందుకు వస్తున్నాయి. అయితే… ప్రతి సినిమాకు విడుదలైన 3,4 రోజుల కలెక్షన్లు చాలా కీలకం. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ పరిశ్రమంలోనే టాలీవుడ్ లో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన టాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలు ఎంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
#1 ఫిదా
ఫిదా సినిమా వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అచ్చమైన తెలంగాణ ప్రేమ కథ ఫిదా. ఈ చిత్రం 18 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే 49 కోట్ల షేర్ వసూలు చేసింది.
#2 ఇస్మార్ట్ శంకర్
పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రం దాదాపు 39 కోట్ల షేర్ వసూలు చేసింది.
#3 అర్జున్ రెడ్డి
అర్జున్ రెడ్డి సినిమా అర్జున్ రెడ్డి సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించాడు. ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ బిజినెస్ కేవలం ఐదు కోట్లు మాత్రమే, 26 కోట్లు పైగా వసూలు రాబట్టింది.
#4 సీతారామం
ఇటీవల కాలంలో బ్లాక్ బస్టర్ హిట్లర్ అందుకున్న సినిమాల జాబితాలో సీతారామం చేరింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల వసూళ్లను నమోదు చేసింది.
#5 బింబిసారా
కళ్యాణ రామ్ హీరోగా హిస్టారికల్ పాయింట్ కు టైం ట్రావెల్ ఫాంటసీ అంశాలను జోడిస్తూ దర్శకుడు వశిష్టు మల్లిడి ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 62.55 కోట్లు పైగా రాబట్టింది.
Advertisement
#6. గీత గోవిందం:
విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ గా మారడంలో అల్లు అర్జున్ పాత్ర చాలా ఉంది. అర్జున్ రెడ్డి కథను రిజెక్ట్ చేసి విజయ్ దేవరకొండకు లైఫ్ ఇచ్చిన అల్లు అర్జున్, ఆ తర్వాత గీత గోవిందం కథ కూడా కాదు అనుకున్నాడు. సినిమాలో హీరోయిన్ డామినేషన్ ఉండడంతో అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్ ఈ కథకు అడ్డు వచ్చింది. అందుకు కూడా చేయలేకపోయాడు బన్నీ. ఇదే సినిమా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించి సంచలన విజయం అందుకున్నాడు దర్శకుడు పరశురాం. రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 70 కోట్ల షేర్ తో పాటు రూ. 55.43 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
#7. కార్తికేయ 2:
ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 తెలుగు సహా హిందీలో సంచలన విజయం సాధించింది. దేశమంతా ఈ చిత్ర సంచలనాలు కొనసాగుతున్నాయి. ఈ సినిమా ఓవరాల్ గా ఇప్పటివరకు రూ. 36కోట్ల షేర్ లాభాలను తీసుకొచ్చింది. అంతే కాదు ఎక్కువ లాభాలను తీసుకొచ్చిన చిత్రాల్లో టాప్ 10 లో నిలిచింది.
#8.ఉప్పెన:
వైష్ణవ్, తొలి సినిమా ఉప్పెనతో సంచలనం రేపాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన చిత్రం రూ.51 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తంగా తొలి సినిమాతో ఈ మూవీ సంచలనం రేపింది. ఈ మూవీ రూ. 20.5 కోట ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే, రూ. 31.02కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
Read also : రిలయన్స్ అధినేత అంబానీ ఆస్తుల్లో విలాసవంతమైన వస్తువులు ఇవే