Advertisement
ప్రస్తుత కాలానికి అనుగుణంగా జరుగుతున్న మార్పులతోపాటు అలాగే ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. పూర్వం మన పెద్దవారు అరటి ఆకులలో అన్నం తినేవారు. అలాగే నేల మీద కూర్చొని తినేవారు. కానీ ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా చేతులతో తినడం మానేశారు. స్పూన్లతో తినడం అలవాటుగా చేసుకున్నారు. అలాగే నేల మీద కూర్చోవడం మానేసి, డైనింగ్ టేబుల్ లో తినడం అలవాటు చేసుకున్నారు. అయితే నేల మీద కూర్చొని తింటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిసుకుందాం.
Advertisement
భోజనం చేసేందుకు కూర్చునే స్థితిలోనే ఒక ఆసనం కనిపిస్తుంది. ఇలా నేల మీద కాలు మడుచుకుని కూర్చునే భంగిమలు సుఖాసనంలో కానీ, అర్థ పద్మాసనంలో కానీ ఉంటాయి. జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేయటానికి, వెన్నుముక నిటారుగా ఉండటానికి మానసిక ప్రశాంతతకు, ఈ ఆసనాలు చాలా ఉపయోగంగా ఉంటాయి. కూర్చొని తినడం వల్ల పొట్ట ప్రతి ముద్దకి ముందుకి వెనక్కి వంగుతూ ఉంటుంది. ఇలాంటి కదలికల వల్ల రెండు లాభాలు. ఒకటి-పొట్ట చేసే ఇలాంటి కదలికల వల్ల జీర్ణ రసాలు తగినంతగా ఊరుతాయి. రెండు-తగినంత ఆహారం తీసుకొని పొట్ట నిండుగా మారిన వెంటనే ఇక తినాలనిపించదు. చిన్నప్పటి నుంచి ప్రతి రోజు నేల మీదే కూర్చొని భోజనం చేసేవారిలో కీళ్ల నొప్పులు తక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు.
Advertisement
ఎందుకంటే నేల మీద కూర్చొని తినడం మన కీళ్లకి చక్కని వ్యాయామం. ఇలా కీళ్లని మడిచే అలవాటే లేకపోతే కొన్నాళ్ళకి అవి పట్టేసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి వృద్ధాప్యంలో సైతం ఒకరి సహాయం లేకుండా నేలమీదకి కూర్చొని, నిల్చోనే శక్తి ఉండటానికి ఈ అలవాటు దోహద పడుతుంది. నేల మీద కూర్చొని తింటున్నప్పుడు తల నుంచి తొడల వరకు ప్రతిభాగము కదులుతుంది. తొడల దగ్గర నుంచి ముడుచుకొని ఉండటం వల్ల రక్త ప్రసారం అంతా శరీరపుపై భాగంలో కేంద్రీకృతం అవుతుంది. జీర్ణవ్యవస్థకు ఉండే పనితీరుకు కూడా ఇది చాలా మేలు చేస్తుంది. తద్విరుద్ధంగా కుర్చీ మీద కూర్చొని ఆహారం తీసుకుంటే రక్త ప్రసారం అంతా కాళ్ల వైపుకి ప్రయాణిస్తుంది. తినే ప్రతిసారి నేల మీద కూర్చోవడం అన్నది మనం ఆహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్న సూచనలను మెదడుకు అందిస్తుంది.
READ ALSO : నటుడు కృష్ణంరాజు లాస్ట్ డ్యాన్స్ ఇదే.. ఎవరితో చేశారో తెలుసా !