Advertisement
పూర్వకాలంలో భార్యలు భర్తలను పిలవడానికి భయపడేవారు. అలా రోజులు మారినా కొలది ఏవండీ, బావగారు, ఏంటయ్యా, ఏమయ్యా, జి, హాజీ అని పిలిచేవారు. ఆ పరిస్థితులు అన్నీ మారిపోయి పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడ్డ కొంతమంది భర్తలను అరేయ్, ఒరేయ్,ఇటు రారా, అటు పోరా అంటూ పిలుస్తున్నారు. కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం ఇది చాలా తప్పు అని అంటున్నారు. ఏ భర్తని అయినా సరే భార్య పేరు పెట్టి అసలు పిలువకూడదట. ఇలా పిలవడం అమర్యాదకరం, అలాగే నలుగురిలో భర్త యొక్క విలువను తగ్గించడమేనని అంటున్నారు నిపుణులు.
Advertisement
also read:మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న మూవీస్
Advertisement
ఈ విషయానికి వస్తే మన కంటే పెద్ద వారిని పేరుపెట్టి పిలవడమే తప్పని, అలాంటిది భార్యకు అన్ని విధాలుగా రక్షణ గా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసినా పేరు పెట్టి పిలవడం చాలా తప్పు అంటున్నాయి హిందూ సాంప్రదాయాలు. ఏకాంతంగా ఉన్నప్పుడు ఎలా పిలిచినా తప్పు లేనప్పటికీ,ఇంట్లో వాళ్ల ముందు, పిల్లల ముందు, బయట వాళ్ల ముందు మాత్రం పేరు పెట్టి పిలవకూడదట. ఇలా చేయడం వల్ల పది మందిలో మీ భర్త గౌరవం తగ్గడమే కాకుండా, మీ గౌరవం కూడా తగ్గుతుందట. మరి ఏ విధంగా పిలవచ్చు అంటే గతంలో అయితే తల్లి పేరును కలుపుతూ పిలిచేవారు. ఉదాహరణకు గౌతమీపుత్ర అని పిలిచేవారు.
ఇప్పుడు తల్లి పేరుతో పిలవడం అసాధ్యం కాబట్టి, ఏవండీ అని అనురాగంతో, బావగారు అనే ఆత్మీయతతో పిలిస్తే మంచి జరుగుతుందని సంప్రదాయాలు అంటున్నాయి. ఒకవేళ పేరుపెట్టి పిలవాలంటే భార్య భర్త ముందు గా కూర్చుని అనుకొని అలా పిలవడం మొదలు పెట్టండి. ఎందుకంటే మీ అత్తమామలు వారి కొడుకును పేరు పెట్టి పిలవడం అస్సలు ఇష్టపడరు. వారిని కూడా కన్విన్స్ చేశాకే మీ భర్తను పేరు పెట్టి పిలవండి అని కొంతమంది హిందూ సాంప్రదాయ నిపుణులు తెలియజేస్తున్నారు.
also read:భార్య భర్తలు 5 మార్పులు కనిపిస్తే మరోకరితో ప్రేమలో ఉన్నట్టేనట? అవేంటంటే?