Advertisement
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న పాపులారిటీ అంతా కాదు. ఈ చిత్ర పరిశ్రమలో వారసత్వంగా హీరోలు కాగా మరికొంతమంది కష్టపడి పైకి వచ్చారు. ఇక మరికొందరు తమ కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో ఉండటం కారణంగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టారు. అయితే ఇప్పటి రోజుల్లో చాలా వరకు హీరోలు కానీ, హీరోయిన్లు కానీ చనిపోయే పాత్రలు ఉన్న క్లైమాక్స్ లకు ఓకే చెప్పడం లేదు. అయితే రిస్క్ అని భావించినా కొంతమంది హీరోలు, హీరోయిన్లు ఇలా చనిపోయే పాత్రలు పోషించారు. వారు ఎవరో ఓ లుక్కేద్దాం రండి.
Advertisement
# అడవి శేష్:
‘మేజర్’ చిత్రంలో శేష్ పాత్ర చనిపోతుంది. ఇది సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ కాబట్టి జనాలు యాక్సెప్ట్ చేసేసారు.
#ప్రభాస్ :
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ “బాహుబలి”. ఇందులో హీరో ప్రభాస్ మరణిస్తాడు.కృష్ణవంశీ దర్శకత్వంలో 2005లో వచ్చిన “చక్రం” సినిమాలో కూడా ప్రభాస్ చనిపోతాడు.
# సాయి ధరమ్ తేజ్:
‘నక్షత్రం’, ‘రిపబ్లిక్’ వంటి సినిమాల్లో సాయి తేజ్ పాత్రలు చనిపోతాయి.
# నాగార్జున:
‘రాజన్న’ చిత్రంలో నాగార్జున పాత్ర చనిపోతుంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకుడు.
Advertisement
#వరుణ్ తేజ్:
‘కంచె’ చిత్రంలో వరుణ్ పాత్ర చనిపోతుంది. హీరోయిన్ పాత్ర కూడా చనిపోతుంది అన్న సంగతి తెలిసిందే.
# విజయ్ దేవరకొండ:
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంలో సెకండ్ హీరోగా చేసిన విజయ్ దేవరకొండ పాత్ర చనిపోతుంది అన్న సంగతి తెలిసిందే.
# దుల్కర్ సల్మాన్:
‘సీతారామం’ చిత్రంలో దుల్కర్ పాత్ర చనిపోతుంది.
# కళ్యాణ్ రామ్:
‘బింబిసారా’ చిత్రంలో కళ్యాణ్ రామ్ పోషించిన టైటిల్ రోల్ చనిపోతుంది. అయితే ఇంకో పాత్ర ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ అయిపోయింది.
# ఎన్టీఆర్:
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2004 లో వచ్చిన “ఆంధ్రావాలా” చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మరణిస్తాడు. అలాగే కె.ఎస్.రవీంద్ర డైరెక్షన్ లో వచ్చిన “జై లవకుశ” లో కూడా ఎన్టీఆర్ చనిపోయే పాత్ర చేశాడు.
# రవితేజ:
రాజమౌళి డైరెక్షన్ లో 2006లో వచ్చిన ”విక్రమార్కుడు” సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో ఉన్న మాస్ మహారాజా రవితేజ మరణిస్తాడు.
READ ALSO : RRR లోని చరణ్ ఎంట్రీ సీన్, ఎన్టీఆర్ ఎప్పుడో చేసేసాడు !