Advertisement
గత కొన్ని నెలల నిరీక్షణ, ఎన్నో ఆశలు, భారీ బడ్జెట్ అన్నిటికీ మించి పూరి జగన్నాథ్ డైరెక్షన్ ఇన్ని హంగులు కలిపిన సినిమా అంటే అభిమానులకు ఎన్నో ఆశలు ఉంటాయి. రౌడీ హీరో ఈ సినిమాలో సరికొత్త లుక్ లో బాక్సింగ్ నేపథ్యంలో రావడంతో, రోజురోజుకు అభిమానుల నిరీక్షణ పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని ఎదురు చూశారు. దీంతో మూవీ ఆగస్టు 25వ తేదీన థియేటర్లోకి రానే వచ్చింది.కానీ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని విజయ్, లైగర్ సినిమా పైసంచలన వ్యాఖ్యలు చేశారు.
Advertisement
విజయ్ దేవరకొండ ఎదుగుదలను పకడ్బందీగా తొక్కేసేందుకు టాలీవుడ్ వర్గాలు ప్లాన్ చేశారనే ప్రశ్నకు ఈ సందర్భంగా వర్మ సమాధానమిస్తూ, ఒక హీరో ఎదుగుతున్నాడు అంటే, చాలామంది హీరోలకు జెలసి. ఎదిగే హీరోను తొక్కేయడం ఎప్పటినుంచో ఉంది. అది సినిమా ఇండస్ట్రీలో సహజం. ఒక హీరో అంటే, మరో హీరోకు పడకపోవడం మానవ సహజం అని వర్మ చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఒక హీరో అభిమానులు మరో హీరో పై వీడియోలు చేసి టార్గెట్ చేయడం విజయదేవరకొండ విషయంలో జరిగింది. ఆ ఛాన్స్ వాళ్లకు లభించేలా విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వర్కౌట్ అయింది అని రాంగోపాల్ వర్మ చెప్పాడు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి కి ముందు నుంచి అదే యాటిట్యూడ్ తో మాట్లాడుతున్నాడు. అందుకే బిగ్ స్టార్ అయ్యాడు.
Advertisement
ఇప్పటికీ విజయ్ దేవరకొండ ఏం మారలేదు. కానీ పరిస్థితులు విజయ్ దేవరకొండకు వ్యతిరేకంగా మారడం వల్ల ఇలాంటి వాదనలు తెరపైకి వచ్చాయి. విజయ్ లో ఎలాంటి మార్పు లేదు. లైగర్ కంటెంట్ బాగా లేకపోవడంతో ట్రోల్స్, వీడియోలు విచ్చలవిడిగా యూట్యూబ్ లో కనిపించాయి అని రాంగోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ ఎవరికి నష్టం చేయదు. ఎన్నో విషయాల్లో సేవలు చేస్తున్నాడు. లైగర్ సినిమా ప్రమోషన్స్ లో ఓ కుర్రాడు బట్టలు లేవు అంటే, రౌడీ బ్రాండ్ నుంచి నీకు బట్టలు ఇస్తాను. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ప్రమోషన్స్ టైం లో నాకు బట్టలు లేవు. సినిమాకు వాడిన కాస్ట్యూమ్స్ వేసుకొని నేను ప్రమోషన్స్ కు వెళ్లాను అని విజయ్ దేవరకొండ చెప్పిన విషయాలపై రామ్ గోపాల్ వర్మ సానుకూలంగా స్పందించాడు. లైగర్ విషయంలో ట్రోల్స్ కు రకరకాల కారణాలు ఉన్నాయి అని అభిప్రాయపడ్డాడు.
Read Also : కాంబినేషన్ హిట్టు, రిజల్ట్ ఫట్టు అని ప్రూవ్ చేసిన 10 సినిమాలు!