Advertisement
ఇండస్ట్రీలో సినీ నటుల గురించి అనేక రూమర్లు వినిపిస్తూ ఉంటాయి.. ఒక హీరో హీరోయిన్ కలిసి ఉన్నా వారి మధ్య ఏదో ఉందని సృష్టిస్తూ ఉంటారు.. అలాగే దర్శక నిర్మాతలకు,హీరోలకు మధ్య ఏదైనా చిన్న మ్యాటర్ వచ్చినా వారి మధ్య సినిమా వస్తుందని ఊహిస్తూ వార్తలు రాస్తూ ఉంటారు.. ఈ విధంగానే రామ్ చరణ్ మరియు ఇతర దర్శక నిర్మాతలతో కొన్ని సినిమాలు రాబోతున్నాయని అనేక వార్తలు వచ్చాయి. కానీ వాటిలో కొన్ని గాసిప్స్ ఉండగా మరికొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయాయి అవేంటో మనం ఇప్పుడు చూద్దాం.
మెరుపు:
Advertisement
ALSO READ; సొంత మరదళ్లను పెళ్లి చేసుకున్న 6గురు హీరోలు ఎవరో మీకు తెలుసా..?
రామ్ చరణ్ ఆరెంజ్ చిత్రం తర్వాత మెరుపు సినిమా చెయ్యాలి. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా చిత్రం. తమిళ దర్శకుడు ధరణి ఈ ప్రాజెక్టు చేయాలనుకున్నాడు. కానీ మధ్యలోనే ఆగిపోయింది.
గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్:
అధికారికంగా అయితే బయటకు రాలేదు గానీ, షెల్వ్ అయినట్టు రిపోర్టులు వచ్ఛాయి. 2వ సగం చరణ్ కి నచ్చలేదట, దీంతో మార్పులు కూడా చేశారట. అయినా చరణ్ కు నచ్చలేదని టాక్.
కొరటాల శివ సినిమా:
Advertisement
అధికారికంగా పూజా కార్యక్రమం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల మూవీ ఆగిపోయింది. అసలు షూటింగ్ వరకు కూడా వెళ్లలేదు.
మణిరత్నం:
ఫేమస్ డైరెక్టర్ మణిరత్నంతో కూడా మూవీ చేస్తున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అఫీషియల్ గా అయితే బయటకి రాలేదు, రూమర్స్ ప్రకారం ఇది ఒక యాక్షన్ డ్రామా అని టాక్ వినిపించింది. కానీ ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు.
త్రివిక్రమ్ శ్రీనివాస్:
అప్పట్లో త్రివిక్రమ్, చరణ్ కాంబినేషన్లో మూవీ వస్తుందని ఒక టాక్ వినిపించింది. అయితే ఈ మూవీకి నిర్మాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని వార్తలు వచ్చాయి.కానీ ఈ మూవీ గురించి అఫీషియల్ గా ఏ న్యూస్ బయటకు రాలేదు.
ఏఆర్ మురుగదాస్:
రామ్ చరణ్ ఏదో ఒక ఫంక్షన్ లో మురుగదాస్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉందని అన్నారు.. అయితే దీనిపై అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. కానీ వీరి కాంబోలో సినిమా కూడా వస్తుందని టాక్ వినిపించింది.ఇక రామ్ చరణే ఒక సారి ఓ ఫంక్షన్ లో మురుగదాస్ తో సినిమా చెయ్యాలని నా కల అని అన్నారు, అప్పట్లో వీళ్లిద్దరి కాంబోలో సినిమా వస్తుంది అని బాగానే టాక్ నడిచింది.
ALSO READ:ప్రభాస్, ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!