Advertisement
కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో రిలీజ్ అవుతాయి. కానీ ఊహించని విధంగా ఫ్లాప్ అవుతుంటాయి. కథని అర్థం చేసుకునే పరిణితి ప్రేక్షకులకు లేకపోవడం వల్ల కొన్ని సినిమాలు ఫెయిల్ అయితే, ఆ సినిమాలకు పోటీగా వేరే సినిమాలు ఉండడం వల్ల కొన్ని సినిమాలు ఆడవు. థియేటర్స్ లో ఆడకపోయినా, బుల్లితెర మీద మాత్రం సూపర్ హిట్ అయినా సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే మన టాలీవుడ్ దర్శకుల పనుల వల్ల కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
#1. త్రివిక్రమ్ శ్రీనివాస్ – అజ్ఞాతవాసి
గురూజీ పీకే కాంబో అది కూడా మూడవసారి అంటే డబుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ అత్తారింటికి దారేది సినిమాలో లైన్ తీసుకొని అటు ఇటు మార్చి అదే సీఈవో, అదే ఫ్యామిలీ డ్రామాని మళ్లీ కొత్తగా చెప్పే ప్రయత్నం చేసి కెరిర్ లో చెత్త డిజాస్టర్ ఫేస్ చేశాడు మన త్రివిక్రమ్.
#2. శ్రీను వైట్ల – అమర్ అక్బర్ ఆంటోనీ
శ్రీనువైట్ల సినిమా అంటే సాధారణ కథతో మినిమం గ్యారంటీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమా మనం ఇప్పటికే చూసిన అతనోఒక్కడే మరియు పాత 80 మరియు 90 ల సినిమాల కాన్సెప్ట్ ని గుర్తు చేస్తుంది. కేవలం స్టైలిష్ మేకింగ్ మరియు విజువల్స్ తో చేద్దాం అనుకున్నారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు.
#3. గుణశేఖర్ – నిప్పు
గుణశేఖర్ అంటే మంచి చేస్ లు, సెట్స్, హీరోయిజం, ఎలివేషన్స్ ఉంటాయి. కానీ ఏదో పాత స్టోరీ లైన్ ని డెవలప్ చేసి తీసిన ఈ నిప్పు మాత్రమే ఆడియన్స్ రివ్యూస్ కి ఆరిపోయింది.
#4 శ్రీకాంత్ అడ్డాల – బ్రహ్మోత్సవం
ఇక మహేష్ బాబు లాంటి స్టార్ ని పెట్టి ఏదో తీద్దాం అనుకోని ఏదో తీశారు అడ్డాల. అసలు ఇలాంటి క్లాస్ ఫ్యామిలీ సబ్జెక్టులో సూపర్ స్టార్ ని పెట్టడమే పెద్ద తప్పు అయితే, దాన్ని మళ్ళీ సరిగ్గా తీయకుండా కెరీర్ లో చెత్త డిజాస్టర్ ఫేస్ చేశారు అడ్డాల.
#5 బోయపాటి శ్రీను – వినయ విధేయ రామ
Advertisement
బోయపాటి సినిమాల్లో లాజిక్స్ కి అందని మ్యూజిక్, మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ వీవీఆర్ లో మాత్రమే ఆ మాస్ ఎలిమెంట్స్ ని కొంచెం ఎగ్జగరేట్ చేసి చూపించడం వల్ల ప్రేక్షకులు ఏంటయ్యా బోయపాటి ఈ అతి అని తిట్టుకున్నారు.
#6. కొరటాల – ఆచార్య
అస్సలు ఫ్లాప్ కాదు కదా…దాని అర్థం తెలియని కొరటాల శివకు ఆచార్య ఒక డిజాస్టర్ ని ఇచ్చింది. కొరటాల సినిమా అంటే ఒక సోషల్ మెసేజ్ తో మాస్ ఫైట్స్, ఎలివేషన్స్, ఎమోషన్స్ మరియు సాంగ్స్ తో సహా ఒక ఫుల్ మీల్స్ లా ఉంటుంది. కానీ ఆచార్యలో బలమైన కథ లేదు, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్లే లేదు…ఓ ఎలివేషన్ కూడా లేదు. పాదగట్టం మాత్రమే ఉంది.
#7. Meher Ramesh – శక్తి
శక్తి పీఠాలు అనే లైన్ చాలా ఆసక్తికరంగా ఉంది…బలహీనమైన కథ, స్క్రీన్‌ప్లే మరియు పేలవమైన vfx, cg అర్థంలేని సన్నివేశాలు, మెహర్ కెరీర్ లో ఓ ఫ్లాఫ్ తీసుకొచ్చింది శక్తి మూవీ.
#8. క్రిష్ – కొండపొలం
క్రిష్ సినిమా అంటే మంచి కథ, పాత్రలు చక్కని స్క్రీన్‌ప్లేతో ఉంటాయి. కొండపొలం ఒక నవల నుండి తీసుకున్న కథ…ఒక యువ ఔత్సాహికుడు ఎలా తన గ్రామాన్ని పశువులను రక్షించి IFS ఆఫీసర్ అయ్యాడు అనే లైన్ బానే ఉన్నా, మేకింగ్ లో పేలవమైన గ్రాఫిక్స్, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవటం తో ఈ మూవీ ఫ్లాఫ్ అయింది.
#9. హరీష్ శంకర్ – రామయ్య వస్తావయ్యా
హరీష్ శంకర్ అంటే.. మాస్ మసాలా కథ, వన్ లైనర్స్ మరియు మంచి ఎంటర్టైన్మెంట్. ఇలాంటి డైరెక్టర్ కి తారక్ లాంటి కటౌట్ యాడ్ అయితే మాస్ జాతరే అనుకున్నారు అంత కానీ, పేలవమైన కథ, బ్లాండ్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెడుతుంది.
#10. చంద్రశేఖర్ యేలేటి – చెక్
ప్రయోగాత్మక సినిమాలు, హాట్కే సబ్జెక్ట్‌లకు కేరాఫ్ అడ్రస్ మన చంద్ర శేఖర్ యేలేటి గారు. కానీ ఈయన గత రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. ఇక చెక్ సినిమాలో నితిన్ క్యారెక్టర్ బాగుంటుంది. నితిన్ చెస్ ని ఫాలో అయ్యి ఎస్కేప్ అయ్యే విధానం ఆసక్తికరంగా ఉంటుంది కానీ సినిమాలో చాలా లాజిక్ మిస్ అయింది.
Read also : ఆ క్లిష్ట పరిస్థితుల్లో బాహుబలిని..రాజమౌళి ఆపేద్దాం అనుకున్నారా..?