Advertisement
స్వాతి రెడ్డి, ఇప్పుడు సోషల్ మీడియాలో హోరెత్తుతున్న పేరు. వేగంగా దూసుకెళ్తున్న రైల్లో ఓ మహిళ పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆపద్బాంధవిగా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నారామే. ‘నేర్చుకున్న విద్యా పదిమందికి ఉపయోగపడాలి తల్లి, పేదలు, సామాన్యుల మనసు గెలవాలి’ అన్న నాన్న మాటలను అలా నిజం చేశారు.
Advertisement
అసలు ఏం జరిగిందంటే,
సికింద్రాబాద్-విశాఖపట్నం దూరంతో ఎక్స్ప్రెస్ రైలులో సెప్టెంబర్ 13వ తేదీ తెల్లవారుజామున ఓ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మహిళ, ఆమె భర్త సికింద్రాబాద్ లో రైలు ఎక్కి తిరిగి విశాఖపట్నం వెళుతున్నారు. అదే రైలులో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న గీతం మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ డాక్టర్ స్వాతి కేసరి ఆ మహిళకు బిడ్డను ప్రసవించేందుకు సహకరించారు. “ఇది తెల్లవారుజామున 3:30 జరిగింది. ప్రసవ నొప్పితో బాధపడుతున్న తన భార్యకు సహాయం చేయడానికి ఒక వ్యక్తి నన్ను సంప్రదించాడు. నేను మెడిసిన్ చదువుతున్నానని అతనికి తెలియదు. కంపార్ట్మెంట్ లోని మరో ఇద్దరు మహిళలు డ్యూటీలో ఉన్న పోలీసుల సహాయంతో, మహిళ ఉదయం 5:35 గంటలకు సురక్షితంగా బిడ్డకు జన్మనిచ్చింది”. అని స్వాతి చెప్పారు.
Advertisement
“గతంలో నేను డెలివరీ సమయంలో నా ప్రొఫెసర్ లు, తోటి వైద్యులకు సహాయం చేశాను. కానీ నేను ఏ పరికరాలు లేకుండా ఒంటరిగా డెలివరీ చేయడం ఇదే మొదటిసారి. డెలివరీ టైం లో నేను టెన్షన్ గా ఉన్నాను. కానీ సురక్షితమైన డెలివరీ తర్వాత నాకు చాలా సంతోషం వేసింది”. అని స్వాతి చెప్పారు. పోలీసులు అనకాపల్లి రైల్వే స్టేషన్ లో ఆంబులెన్స్ ను ఏర్పాటు చేసి మహిళను, అప్పుడే పుట్టిన బాలికను ఎన్టీఆర్ ప్రభుత్వ ఆరోగ్య ఆసుపత్రికి తరలించారు. నవజాత బాలికకు జీవితాంతం ఉచిత రైలు ప్రయాణం కల్పిస్తామని అనకాపల్లి స్టేషన్ మాస్టర్ ప్రకటించారు. గీతం వైద్య కళాశాల అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు డాక్టర్ స్వాతి ఆమె వీరోచిత చర్యను అభినందించారు.
READ ALSO : 2022లో నిర్మాతలకు భారీ నష్టాలని మిగిల్చిన 10 సినిమాలు ఇవే !