Advertisement
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి టాప్ హీరోలు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు మాత్రమే. వారు సినిమాలు తీయడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీని ఎంతో అభివృద్ధి చేయడంలో చాలా చక్కని పాత్ర పోషించారని చెప్పవచ్చు. అందుకే వారి గురించి ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అయితే.. అగ్ర హీరోలుగా వెలిగిన ఈ ఇద్దరి మీద ఒక అపవాదు ఇప్పటికీ మనకు వినిపిస్తూ ఉంది. అదే ఈ ఇద్దరు హీరోలు కొత్తవారిని సినిమా అవకాశాలు రాకుండా తొక్కేశారు. అలా హరినాథ్ కు అవకాశాలు లేకుండా చేశారు అంటూ ఇప్పటికీ చెబుతూ చెప్పుకుంటారు. కానీ అసలు జరిగింది ఏమిటో ఎవరికీ తెలియదు. అయితే ఈ విషయం గురించి క్లారిటీగా విశ్లేషణ అందించారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ.
Advertisement
Advertisement
సినిమాల్లో అప్పటికే అగ్ర హీరోగా ఉన్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక అలాంటి సమయంలో హరినాథ్ గారు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నిజానికి చాలా సినిమాలకు హీరోగా హరినాథ్ గారిని రిఫర్ చేసింది రామారావు గారే. ఆయనను పెట్టుకుంటే బడ్జెట్ వర్క్ అవుట్ కాదు అనుకున్న సినిమాలకు హరినాథ్ గారి పేరును సిఫార్సు చేసేవారట ఎన్టీఆర్ గారు. ఇక ‘సీతారామ కళ్యాణం’ సినిమాను సొంతంగా చేస్తున్నప్పుడు రావణుడిగా ఎన్టీఆర్ నటించాలని భావించి రాముడిగా హరినాథ్ గారిని తీసుకొని మంచి వేషం ఆయనకు ఇప్పించారు. ఇక ఏ ఎన్ ఆర్ కూడా ఆయన సినిమాలకు చక్కటి ప్రణాళిక వేసుకొని నటించారే కానీ ఇతరుల జోలికి వెళ్లలేదు. ఇంకొకరిని తొక్కల్సిన అవసరం ఆ ఇద్దరు అగ్ర నటులకు ఆ రోజుల్లో లేదు. ఇక్కడ హరినాథ్ గారిది స్వయకృపరాధం అంటూ భరద్వాజ గారు చెప్పారు. ఆయన తాగుడుకు బానిస అవడం వల్ల ఆయన సినిమాలకు అవకాశాలను కోల్పోయారు. షూటింగ్ లకు తాగి రావడం వల్ల హీరోయిన్లు ఇబ్బంది పడే వారట.
చాలాసార్లు పాటల షూటింగ్స్ లో తడబడటం, తూలడం హీరోయిన్ మీదకు పడిపోవడం వంటివి జరిగిన అనుభవాలను జమున, గీతాంజలి వంటి హీరోయిన్లు చాలా ఇంటర్వ్యూలో కూడా పంచుకున్నారు. అలా హరినాథ్ గారిని ఎవరు తొక్కేయలేదు. కేవలం ఆయన వ్యసనాల కారణంగా ఆయనే అవకాశాలను కోల్పోయారు. ఆ లోటును కొంతకాలానికి శోభన్ బాబు, కృష్ణ భర్తీ చేశారు అంటూ చెప్పారు భరద్వాజ్ గారు.
Read also : స్టార్ డైరెక్టర్స్ వారి కెరీర్ లో వచ్చిన పరమ చెత్త సినిమాలు !