Advertisement
భూమీ పైన వేగంగా వెళ్ళే మార్గం రైలు మార్గం. అయితే ఈ రైలు ప్రయాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే రైలు ప్రయాణం ఒక అద్భుతమైన ప్రయాణం అని చెప్పాలి. ఈ రైలు నిర్మాణాన్ని మహాద్భుతం అనే చెప్పుకోవాలి. ఈ రైళ్లను బ్రిటీష్ వారి కాలం నుంచే ఈ రైల్వే వ్యవస్థ మనదేశంలో బలపడింది.
Advertisement
మనం రైల్వే ట్రాక్ గమనించినట్లయితే రెండు లేయర్లు మట్టి, తర్వాత కంకర, ఆ తర్వాత పొడవైన ఇనుప ప్లేట్లు ఉంటాయి. కంకర రాళ్లు ఉండటాన్ని బ్లాస్ట్ అని అంటారు. పొడవైన ఇనుప ప్లేట్లను స్లీపర్స్ అని పిలుస్తారు. రైల్వే ట్రాక్ నిర్మాణం జరుగుతున్న సమయంలో భూమి కంటే కాస్త ఎత్తులో ఈ రైల్వే ట్రాక్ నిర్మిస్తారు. రైల్వే పట్టాలపై ప్రయాణం చేస్తున్న సమయంలో రైలు బరువు నియంత్రించడానికి స్లీపర్స్, బ్లాస్టర్స్ పనిచేస్తాయి. సైన్స్ ప్రకారం రైల్వే ట్రాక్ కదులుతున్నప్పుడు వైబ్రేషన్స్ ఏర్పడుతాయి.
Advertisement
ఈ క్రమంలోనే రైల్వే ట్రాక్ పై కంకర రాళ్లు వేసినప్పుడు ఈ వైబ్రేషన్స్ కారణంగా రైల్వే ట్రాక్ వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. అందుకే రైల్వే ట్రాక్ పై కంకరను ఎక్కువగా ఉపయోగిస్తారు. అలా కంకర కాకుండా నునుపుగా ఉండే రాళ్లు వేయడం వల్ల రైలు ప్రయాణిస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్ కారణంగా రైల్వే ట్రాక్ వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉండటం వల్ల ప్రమాదాలు జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అందుకే రైల్వే ట్రాక్ నిర్మాణం జరిగేటప్పుడు రైల్వే ట్రాక్ కింద పట్టాలకు ఇరువైపులా నునుపుగా ఉండే రాళ్లు కాకుండా కంకర వేయడం జరుగుతుంది.
READ ALSO : క్రికెటర్లను పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్లు వీరే