Advertisement
టాలీవుడ్ లోని పాటల రచయితల్లో చంద్రబోస్ ది ప్రత్యేకమైన స్థానం. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ పాటలను రాశారు. వరంగల్ కు చెందిన చంద్రబోస్ హైదరాబాదులో ఇంజనీరింగ్ చదువుకున్నాడు. చదివింది ఇంజనీరింగ్ అయినా తనకు పాటలపై, సాహిత్యం పై ఉన్న ఆసక్తితో ఆ దిసగా అడుగులు వేశారు. మొదటిసారిగా తన స్నేహితుడు ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కిన తాజ్ మహల్ అనే సినిమాలో మంచుకొండల్లో చందమా చందనాలు చల్లిపో అనే పాటను రాశారు. ఆ తర్వాత ఆయనకు ఇండస్ట్రీలో తిరిగే లేదు.
Advertisement
ఇక బోస్ పెళ్లి విషయానికొస్తే, అది ఓ అందమైన ప్రేమకథ అని చెప్పుకోవాలి. ఆ కథని సినిమాగా తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. పెళ్లి సందడి సినిమా సమయంలోనే సుచిత్ర తో చంద్రబోస్ పరిచయమైంది. బేసిగ్గా కొరియోగ్రాఫర్ అయిన సుచిత్ర, పాటల రచయిత అయిన చంద్రబోస్ తో పెళ్లి పీటలు అనే సినిమాకు కూడా కలిసి పనిచేశారు. ఆ సినిమా కోసం హైదరాబాద్ నుండి చెన్నైకి విమానంలో పక్కపక్క సీట్లో కూర్చొని ప్రయాణం చేయాల్సి వచ్చింది.
Advertisement
ఆ సమయంలో ఏర్పడిన పరిచయంతో ఇద్దరి మధ్య సన్నిహిత్యం ఏర్పడింది. కొన్నాళ్ళకు చంద్రబోస్ ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటానంటూ ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ వయసులో చంద్రబోస్ కంటే సుచిత్ర ఆరు సంవత్సరాలు పెద్ద. దాంతో కాస్త వీళ్ళ పెళ్లికి ఇబ్బందులు తలెత్తాయి. అయినా చంద్రబోస్ పట్టుదలతో తాను కోరుకున్న సుచిత్రను పెళ్లి చేసుకునేందుకు మొగ్గు చూపాడు. అతని పట్టుదలని చూసి సుచిత్ర కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నిజంగా వీళ్ళ ఇద్దరి ప్రేమ కథ సినిమా తీస్తే మంచి హిట్ అవుతుందేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
READ ASLO : ప్రణీత భర్త ఏం చేస్తాడో తెలుసా.. అతనికి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా ?