Advertisement
అలనాటి హీరోయిన్, అందాల తార సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అద్భుతమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకుంది.. ఆమె తండ్రి సినీ బ్యాక్ గ్రౌండ్ ఎక్కువగా ఉండడంతో ఈమె కూడా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అతికొద్ది కాలంలోనే పెద్ద స్టార్ గా మారిపోయింది.. ఎంత తొందరగా ఇండస్ట్రీలో ఎదిగిందో అంతే తొందరగా విమాన ప్రమాదంలో మరణించింది.
Advertisement
అయితే సినీ పరంగా సౌందర్య ఎంత మంచి పేరు సంపాదించుకుందో, వ్యక్తిగతంగా సౌందర్య అంతే విమర్శల పాలైంది. దానికి కారణం ఆమె తన ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకుండానే తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం. నిజానికి సౌందర్య అంటే చాలా పద్ధతిగా, సైలెంట్ గా ఉంటుంది. చెప్పిన మాట వింటుంది అనే పేరు ఉంది.
Advertisement
కానీ అన్ని విషయాల్లోనూ అమ్మ మాట విన్న సౌందర్య కేవలం, పెళ్లి విషయంలో మాత్రం తల్లిదండ్రుల మాట వినలేదు. జి.ఎస్ రఘు అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే నిజానికి వీళ్లిద్దరి జాతకంలో దోషం ఉన్నట్లు, వీరిద్దరి జాతకాలు మ్యాచ్ అవ్వవని ముందే చెప్పారట. కానీ ప్రేమ అనే మత్తులో సౌందర్య ఆ జాతకాలను పక్కన పెట్టేసి రఘు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీ పెళ్లి చేసుకుంది. అయితే ఊహించిన విధంగా సౌందర్య పెళ్లి అయిన కొంత కాలానికి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది.
Read Also : సీరియల్స్ లో నటించి.. సినిమాల్లోకి వచ్చిన స్టార్లు వీళ్లే ?