Advertisement
రామ్ చరణ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2007 లో విడుదలైన చిరుత చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు చరణ్. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియు నంది స్పెషల్ జ్యురీ అవార్డులని అందించింది.
Advertisement
ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి గారు దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతోపాటు, ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియు నంది స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించాడు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోగా చరణ్ కొనసాగుతున్నాడు.అయితే నిజానికి చిరంజీవికి తన కొడుకు రామ్ చరణ్ ని హీరోగా చూడడం ఇష్టం లేదట.
Advertisement
ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవని విషయం చిరంజీవికి బాగా తెలుసు. పైగా మనం పైకి ఎదుగుతుంటే వెనక తొక్కేసే జనాలు బోలెడు మంది ఉంటారు. దీంతో ఈ టెన్షన్స్ అంతా వద్దు అని చరణ్ డాక్టర్ అవ్వాలని, నలుగురికి ఉపయోగపడాలని కోరుకున్నారట. కానీ చరణ్ కి మొదటి నుంచి సైన్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదట. చదువులో కూడా చరణ్ సూపర్ స్టూడెంట్ అని చెప్పలేం. అందుకే చిరు క్రమీన ఆయన ఆ ఆలోచన నుండి బయటకు వచ్చాడు. అంతేకాదు అదే టైములో చరణ్ నేను హీరో అవుతాను నాన్న అనగానే తన ఇంట్రెస్ట్ ని కాదనలేక సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. దీంతో చిరు కోరిక తీరకుండా అలాగే మిగిలిపోయింది.
Read Also : మీ ఇంట్లో పావురాల గూడు ఉందా? అయితే ఈ సమస్యలు అవుతాయట !