Advertisement
Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 27.09.2022: రాశి ఫలాలు.. మానవ జీవితంలో భాగం అయిపోయాయి. ప్రస్తుతం కాలంలో.. ఈ రాశిఫలాలకు డిమాండ్ భారీగానే పెరిగిపోయింది. గతంలో వీటిని నమ్మని వారు కూడా ఇప్పుడు నమ్మేటు వంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అయితే..ఇవాళ్టి రోజున ఏఏ రాశుల వారికి… ఏం జరుగుతుందో వారి రాశుల ప్రకారం చూద్దాం.
Advertisement
మేషం :- వ్యాపారాలు ఊపందుకుంటాయి. బంధు మిత్రుల రాకతో పనులు మందకొడిగా సాగుతాయి. వాహన చోదకులకు దూకుడుతగదు. ఉపాధ్యాయులుకు శుభాకాంక్షలు అందజేస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. దూర ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
వృషభం :- తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. పత్రిక, ప్రైవేటు, విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం పెరుగుతుంది. ఆప్తుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. ప్రస్తుత వ్యాపారాలపైనే శ్రద్ద వహించండి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు.
మిథునం :- ఒక విషయంలో మిత్రులపై ఉంచిన మీ నమ్మకం వమ్ము అయ్యే ఆస్కారం ఉంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. మీ సంతానానికి ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులలో అవకాశం లభిస్తుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
కర్కాటకం :- బంధు మిత్రుల కలయితో మానసికంగా కుదుటపడతారు. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులు విందులు, వేడుకల్లో పాల్గొంటారు. వృత్తి ఉపాధిపథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
సింహం :- వృత్తి, వ్యాపారాలలో లక్ష్యాలు సాధిస్తారు. ప్రింటింగ్ రంగంలో వారికి సదావకాశాలు లభిస్తాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బందికలిగిస్తుంది. మీ ప్రతిభ వెలుగులోనికి వస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు.
కన్య :- భాగస్వామిక వ్యపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు.
Advertisement
తుల :- మీ కళత్ర మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులు బహుమతులు అందుకుంటారు. కొబ్బరి, పండు, పూలు, పానియ, చిరు వ్యాపారులకు లాభదాయకం. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవలసివస్తుంది. సోదరీ, సోదరులతో సమస్యలు తలెత్తుతాయి.
వృశ్చికం :- వాణిజ్య ఒప్పందాలు, నగదు చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. గతంతో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థిక స్థితి కొంత మెరుగనిపిస్తుంది. వృత్తుల వారికి కలిసిరాగలదు. ప్రేమికుల తొందరపాటు చర్యలు సమస్యలకు దారితీస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
ధనస్సు :- రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా బలపడతాయి. తరుచు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. దైవకార్యం, విందుల్లో పాల్గొంటారు. ఒంటెత్తు పోకడ మంచిది కాదు గమనించండి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు అనుకూలం.
మకరం :- వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. కుటుంబంలో నెలకొన్న అనిశ్చితలు, అశాంతి క్రమంగా తొలిగిపోగలవు. మీ ఉన్నతిని చాటుకోడటం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. స్థిర బుద్ది లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయటం మంచిది.
కుంభం :- వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. మీ ఆలోచనల్లో కొంత మార్పు వస్తుంది. ఎదుటి వారి అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకం.
మీనం :- ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక సమస్యను అధికమిస్తారు. ఉద్యోగస్తులు మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. మీ వ్యాఖ్యలను బంధు మిత్రులు అపార్థం చేసుకుంటారు.
READ ALSO : మెగాస్టార్ చిరును ఈ ఇద్దరు హీరోయిన్లు బాగా ఇబ్బంది పెట్టరాట..?