Advertisement
ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో… ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఆ పేరును తొలగించి, వైయస్సార్ అని జగన్ సర్కారు పెట్టింది. దీంతో ఈ వివాదం రాజుకుంది. అంతటి మహానీయుడైన ఎన్టీఆర్ పేరును ఎలా తొలగిస్తారని టిడిపి పార్టీతో పాటు ఇతర విపక్షాలు కూడా గొంతేతి మొత్తుకుంటున్నాయి. కానీ వైసీపీ పార్టీ మాత్రం… తాము ఈ విషయంలో తగ్గేదే లేదని ముందుకు సాగుతోంది.
Advertisement
ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ సైతం వైసీపీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జగన్ సర్కారును వ్యతిరేకించిన ఎన్టీఆర్… సాఫ్ట్ కార్నర్ లో ఆ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. అయితే దీనిపై టిడిపి కార్యకర్తలు అలాగే కీలక నేతలు సీరియస్ అవుతున్నారు. మీ తాత పేరు తీసేస్తే ఇంత సాఫ్ట్ గా.. స్పందిస్తారా అని నిలదీస్తున్నారు టిడిపి కార్యకర్తలు. ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్కు అతని అభిమాని ఓ లేఖ రాశాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అన్నా!
నేను నీ అభిమానిని. నాది మీ అమ్మగారి కులము కాదు, మీ నాన్నగారి కులము కాదు. కులాన్ని బట్టి అభిమానించే అభిమానిని కాను నేను. నాకు నీ డ్యాన్స్ అంటే ప్రాణం. నీ డైలాగ్ డెలివరీ అంటే ఇష్టం. నీ కామెడీ టైమింగ్ అంటే అభిమానం. ఓవరాల్ గా నువ్వు నటనలో ఏ రసం పిండిన అతి ఉండదు. అతకన్నట్టు ఉండదు. పోలుస్తున్నానని అనుకోవద్దు కానీ, నీలాగా అన్ని విషయాలలోనూ టాప్ అనిపించుకున్న హీరోలు నీ నందమూరి వంశంలో కూడా లేరు. వై.ఎస్.ఆర్ ని ఎన్.టి.ఆర్ ని సమానంగా గౌరవిస్తూ పెట్టిన నీ ట్వీట్ కొంతమంది కులగజ్జిగాళ్ళకి, పార్టీ పిచ్చోళ్ళకి నచ్చలేదు. వాళ్లేదో వాగుతున్నారు. అయినా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం ఆవగింజయినా లేదు.
Advertisement
ఎందుకో చెప్తాను.
చిన్నప్పటి నుంచి నీకు, మీ అమ్మగారికి నందమూరి కుటుంబం ఇచ్చిన విలువలేమిటో మరిచిపోయి, కాసేపు అన్ని పక్కన పెట్టి 2009లో నువ్వు ఎగేసుకుని వాళ్ళ పార్టీకి ప్రచారం చేసావు. ఆ సమయంలో నీకు యాక్సిడెంట్ అయ్యింది. చావు తప్పి బయటపడ్డావు. అయినా నీ సేవలు తీసుకున్న ఎవడు నిన్ను సరైన పరామర్శ అయినా చేయలేదు. వాడుకొని వదిలేసే వాళ్ళ నైజాన్ని నువ్వు మనసారా రుచి చూసావు.
ఇక ఎలక్షన్స్ అయ్యాక ఆ పార్టీకి అప్పట్లో సినులేక ఓడిపోయింది. వాళ్ళు మాత్రం సైలెంటుగా ఓటమిని నీ ఖాతాలో వేశారు. అదేదో నువ్వు ప్రచారం చేయకపోతే వాళ్ళు గెలిచే వాళ్లు అన్నట్టుగా అంత సిగ్గుమాలిన కృతజ్ఞత లేని జాతి అది. అయినా పచ్చ గ్యాంగ్ కి ఒక ప్రశ్న వేయాలి. నిజంగా వాళ్ల చేతుల్లో వాళ్ల కులపు హీరోలా కెరీర్లు ఉంటే మరి తారక రత్నాన్ని, కళ్యాణ్ రామ్ ని ఎందుకు టాప్ హీరోల్ని చేయలేకపోయారు. టాలెంట్ ఉండి జనాభిమానం కలిసొస్తే ఎవడన్నా టాప్ లోకి వెళ్తాడు. లేకపోతే ఒకేసారి 9 సినిమాలు చేసిన, 90 బ్యానర్లు కట్టిన ఎవడు పట్టించుకోడు.
కనుక అన్నా! నువ్వు ఎవరిని పట్టించుకోకు. అందర్నీ సమానంగా చూస్తూ, నీకు న్యాయం అనే విధంగా విషయాల మీద ఇలాగే స్పందిస్తూ ముందుకెళ్ళు. దయచేసి ఏ వర్గం వైపుకు మొగ్గకు. అన్నిటికీ అతీతంగా నిలబడి నెంబర్ వన్ గా ఎదిగేంత టాలెంట్ నీకు దేవుడు ఇచ్చాడు. ఆ దేవుడికి, నీ మనస్సాక్షికి జవాబుదారీగా ఉండు అంతే. ఇవన్నీ నీకు తెలియవని కాదు. నువ్వు ఫాలో అవుతున్నదే నీకు చెప్పాను. కేవలం నీ అభిమానిగా నా మనసులో ఉన్నది చెప్పి ఇలాగే కంటిన్యూ అయిపోమని విన్నవించుకుంటున్నాను అని ఆ అభిమాని లేఖ పేర్కొన్నారు.
read also : ఎన్టీఆర్ కెరీర్ లో ఒక్కరోజు కూడా ఆడని పరమ చెత్త సినిమా ఏంటో తెలుసా?