Advertisement
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాల పాటు ఒక ఊపు ఊపింది రోజా.. తెలుగు ఇండస్ట్రీ లో ఉన్నటువంటి అగ్ర హీరోలందరితో ఆమె నటించింది. నటించడమే కాకుండా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నది.. ఇలా సినిమాల ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న రోజా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మంత్రిగా పని చేస్తోంది.
Advertisement
ఇది ఇలా ఉండగా.. దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఓ ప్రైవేట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమానికి రోజా హాజరయ్యారు. దసరా వైభవం పేరుతో విజయదశమినాడు అంటే అక్టోబర్ 5వ తేదీన ఇది ప్రసారం కానుంది. పండుగ రోజున ప్రేక్షకులను అలరించడానికి రూపొందించిన స్పెషల్ ఎపిసోడ్ ఇది. రోజాతో పాటు సీనియర్ నటి అన్నపూర్ణ, హాస్యనటుడు కృష్ణ భగవాన్ గెస్ట్ గా హాజరయ్యారు. శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించారు. హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, సహా టీవీ సీరియల్ లో నటించే పలువురు నటీనటులు ఈ ఎపిసోడ్ లో దర్శనమిచ్చారు.
Advertisement
ప్రారంభంలో సరదాగా సాగినప్పటికీ, చివర్లో తేడా కొట్టినట్టే కనిపించింది. హైపర్ ఆది, రోజాను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏ శాఖలు ఎవరికి ఇస్తే బాగుంటుందో చెప్పాలని కోరారు. శ్రీముఖి ఈ మధ్య అన్ని చానల్లో కనిపిస్తున్నందున ఆమెకు పర్యాటక శాఖ, తినడంపై ధ్యాస ఉన్నందున హైపర్ ఆదికి ఆహార భద్రత శాఖ సెట్ అవుతాయని రోజా సమాధానం ఇచ్చారు. చివర్లో వాళ్లు ఇబ్బందికర ప్రశ్నలు అడిగినట్లు కనిపించింది. ఆ ప్రశ్నలేమిటి అనేది ఈ ప్రోమోలో లేవు. కానీ, అవి రోజాకు మాత్రం తీవ్ర ఆగ్రహానికి గురిచేసాయి. ఏం మాట్లాడుతున్నావ్, అంటూ హైపర్ ఆది, శ్రీముఖి తో పాటు పక్కనున్న వారి మీద రోజా అసహనం వ్యక్తం చేశారు. అసలు నన్ను పిలిచింది అవమానించడానికా, అని నిలదీశారు. తన మెడలో ఉన్న దండను తీసి పక్కన పడేశారు. అందరూ ప్లాన్ చేసుకొని నన్ను రమ్మన్నారా? అని స్టేజి దిగి వెళ్లడం ఈ ప్రోమోలో కనిపించింది.
Click Here to Watch – Watch Here
Read Also : ఎన్టీఆర్ ట్రస్ట్ వివాదంపై ఎన్టీఆర్ కి రాసిన ఓపెన్ లెటర్ ! అతను చెప్పేది నిజామా కాదా ?