Advertisement
లోకం మీద అనేక పోకడలు తెరపైకి వస్తున్నాయి. వింత వింత ఆచారాలు, కల్చర్ తో నానా రచ్చ చేస్తున్నారు మన జనాలు. అయితే తాజాగా రెంట్ కు బాయ్ ఫ్రెండ్ ను ఇస్తామంటూ వచ్చేశారు. గంటల లెక్కన మీకు కావాల్సిన బాయ్ ఫ్రెండ్ ను బాడుగకు ఇస్తామంటూ బెంగళూరులో కొందరు టేకిలు ఓ వెబ్సైట్ ను ప్రారంభించడం సంచలనంగా మారింది. ప్రియుడు వంచించాడనో, ప్రేమ విఫలమైందనో, నిజమైన ప్రేమ దక్కలేదనో బాధకు గురైన వారికి ‘టాయ్ బాయ్’ పేరిట వీరు ఒక పోర్టల్ ను ప్రారంభించారు.
Advertisement
కాకపోతే అబ్బాయి ఎవరి వద్దకు భౌతికంగా రాడు. ఫోన్ ద్వారా వారి సమస్యను పూర్తిగా విని, మానసిక ఆందోళనను దూరం చేసేందుకు సహకారం అందిస్తాడని, పోర్టల్ ను అభివృద్ధి చేసిన కౌశల్ ప్రకాష్ తెలిపారు. దీనిని ఒక స్టార్టప్ గా తాము రూపొందించామని, దీంతోపాటు ఆర్ఏబిఎఫ్ అనే యాప్ ను అభివృద్ధి చేశామని ఆయన పేర్కొన్నారు.
Advertisement
తమ పోర్టల్, యాప్ లోని సేవలను నిర్ణీత రుసుము చెల్లించి, వినియోగించుకోవలసి ఉంటుందని వివరించారు ప్రకాష్. మానసిక సమస్యలు, ఒంటరితనంతో బాధపడే వారికి సానుకూల వచనాలతో ధైర్యం చెప్పడానికి, కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఇప్పటికే చాలా వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రేమలో విఫలమైన యువతులకు ఉద్దేశించి ‘టాయ్ బాయ్’ పేరుతో అబ్బాయిలను అద్దెకు ఇస్తామనడమే ఇక్కడ వివాదాస్పదంగా మారింది. దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
Read Also : ఈ 4 సంకేతాలు కనిపిస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తప్పవట!