Advertisement
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరో, హీరోయిన్లకు కొంతమంది డూప్ లుగా ఉంటారు. ఏదైనా కష్టమైన రోల్స్ చేసే సమయంలో డూప్స్ తో చేయిస్తారు.. దీనికి ప్రధాన కారణం ఏదైనా స్టంట్స్ చేసే సమయంలో హీరోలకు ఏవైనా గాయాలు జరిగితే సమస్య వస్తుంది కాబట్టి ఈ డూప్ లతో చేయిస్తూ ఉంటారు. అప్పట్లో డూప్ పెట్టి చేయించిన ఎవరూ అంతగా గుర్తుపట్టేవారు కాదు..
Advertisement
also read: ఎస్పీ బాలు గారికి రోజా తండ్రికి మధ్య ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా..?
కానీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి చిన్న విషయమైనా గుర్తుపట్టి క్షణాల్లో బయట పెడుతున్నారు. అలాగే హీరోలకు నటించినటువంటి డూప్ ల గురించి కూడా తెలుసుకుంటున్నారు.. అయితే ఇటీవలే ఒక షో లో గత 30 సంవత్సరాలుగా చిరంజీవికి డూప్ గా చేసిన వ్యక్తిని పరిచయం చేశారు. అయితే ఈ టీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ నిర్వాహకులు కొన్ని ప్రాంతాలకు వెళ్లి అక్కడ టాలెంట్ ఉన్న వ్యక్తులను బయటకు తీసుకు వస్తారు.
Advertisement
ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లగా వీరి షోలో చిరంజీవి డూప్ గా వ్యవహరించిన వ్యక్తి గురించి వెలుగులోకి వచ్చింది. అతని పేరే ప్రేమ్ కుమార్. ఆయన గత 30 సంవత్సరాలుగా చిరంజీవి డూప్ గా పని చేస్తున్నారని తెలిసింది.. ఈ విషయం తెలియడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. దీంతో సోషల్ మీడియాలో అతని ఫోటోలతో సహా షేర్ చేస్తూ కామెంట్లు, ట్రోల్ చేస్తున్నారు.
also read:ఓకే సినిమాలో హీరోగా- విలన్ గా చేసిన స్టార్ హీరోలు ఎవరంటే..?