Advertisement
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్స్ లో వేణుమాధవ్ ఒకరు. వైవిద్యమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న వేణుమాధవ్ చిన్న వయసులోనే కన్నుమూశారు. వేణుమాధవ్ కు భార్య శ్రీవాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేణుమాధవ్ స్వస్థలం సూర్యాపేట జిల్లా కోదాడ. 1968 సెప్టెంబర్ 28న ఆయన జన్మించారు. ఇక వేణుమాధవ్ మరణంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వేణుమాధవ్ మూడు షిఫ్ట్ లలో పని చేస్తూ బిజీగా ఉండేవాడు. దాదాపు స్టార్ హీరోలు అందరితో కలిసి పని చేశాడు.
Advertisement
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. వ్యక్తిగతంగా కూడా వీరిద్దరికీ మంచి అనుబంధం ఉంది. వీరిద్దరి మధ్య ఒక ఆసక్తికరమైన ఒప్పందం కూడా ఉన్న విషయం గతంలో ఓ సందర్భంలో వేణుమాధవ్ వెల్లడించారు. సినిమాల్లో సంపాదించిన డబ్బులతో హైదరాబాద్ లో ఇళ్లే కాక తన సొంతూరులో 10 ఎకరాల పొలం కూడా కొన్నాడు వేణుమాధవ్.
Advertisement
అందులో వ్యవసాయం చేసి పంటలు కూడా పండించేవాడు. తన పొలంలో వారి పంట కోతకు వచ్చాక ఒక బియ్యం బస్తాను పవన్ కళ్యాణ్ ఇంటికి పంపేవాడట వేణుమాధవ్. ఇక పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ శివార్ లోని ఫామ్ హౌస్ లో మామిడి తోట ఉన్న సంగతి తెలిసిందే. దాని నుండి టాలీవుడ్ లో కొంతమంది స్నేహితులకు ఏటా మామిడి పండ్లు పంపాలన్నది ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం అని వేణుమాధవ్ గతంలో చెప్పారు. ఆ మామిడి పండ్లను వేణుమాధవ్ కుటుంబానికి కూడా పవన్ కళ్యాణ్ పంపారు. ఈ విషయాన్ని వేణుమాధవ్ కుటుంబ సభ్యులు కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తెలిపారు. కాగా ‘తొలిప్రేమ’, ‘అన్నవరం’, ‘సుస్వాగతం’, ‘గుడుంబా శంకర్’ వంటి సినిమాల్లో పవన్, వేణుమాధవ్ కలిసి నటించారు.
Read also : అమ్మ చివరి కోరికను తీర్చలేని మహేష్ బాబు కుమిలిపోతున్నారా?