Advertisement
హిందీ, తెలుగు ఏవైనా.. సినిమాలు అన్నాక హిట్లు, ఫ్లాప్ లు కామన్. హిట్ వస్తే సినిమా చేసిన నటులతో పాటు దర్శకుడికి మంచి పేరు వస్తుంది. నిర్మాతకు కాసుల వర్షం కురుస్తుంది. అయితే కొన్ని సార్లు సినిమాలు డిజాస్టర్లు కావడంతో నిర్మాతలు కోలుకోలేని దెబ్బ తింటారు. అలాంటి సందర్భాల్లో హీరోలు, హీరోయిన్ తమ రెమ్యూనరేషన్ డబ్బులు తిరిగి ఇవ్వడం. లేదంటే మరో సినిమాలో డబ్బులు తీసుకోకుండా నటించడం చేస్తారు. అయితే.. ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో రెమ్యూనరేషన్ డబ్బులు తిరిగి ఇచ్చిన హీరోల గురించి తెలుసుకుందాం.
Advertisement
#రామ్ చరణ్
వినయ విధేయ రామ సినిమా ఘోర పరాజయం పొందింది. దీంతో దానయ్య, రామ్ చరణ్ డిస్ట్రిబ్యూటర్లకు ఐదు కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చారు.
#సాయి పల్లవి
ఈమె హీరోయిన్ గా చేసిన సినిమా పడి పడి లేచే మనసు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో తన రెమ్యునరేషన్ మొత్తాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చింది.
#విజయ్ దేవరకొండ
తొలి షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో లైగర్ బాక్సాఫీస్ లెక్కలన్నీ తలకిందులు అయ్యాయి. దీంతో విజయ్ తన పారితోషికంలో కొంత భాగాన్ని వదులుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకి విజయ్ రూ. 35 కోట్ల పారితోషికం తీసుకున్నాడని ఇప్పటికే వార్తలు వినిపించాయి.
Advertisement
#మహేష్ బాబు
ఈయన హీరోగా చేసిన సినిమా ఖలేజా. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర గోరపరాజయం చవిచూసింది. అయితే తన రెమ్యూనరేషన్ లో సగం నిర్మాతకు తిరిగి ఇచ్చేశాడు.
#పవన్ కళ్యాణ్
ఈయన నటించిన జానీ, పులి ఫ్లాప్ అయ్యాయి. అయితే ఇతను పారితోషికంలో 40% నిర్మాతలకు తిరిగి ఇచ్చారు.
#రామ్ చరణ్
ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయ్యాక రామ్ చరణ్ తన రెమ్యూనరేషన్ లో 30% తిరిగి వెనక్కి ఇచ్చాడు.
#జూనియర్ ఎన్టీఆర్
నందమూరి హీరో ఎన్టీఆర్ నటించిన నరసింహుడు ఫ్లాప్ అయ్యింది. దీంతో సగం రెమ్యూనరేషన్ నిర్మాతకు ఇచ్చాడు.
#బాలకృష్ణ
బాలయ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి ప్లాప్ అయ్యింది. ఈ నేపథ్యంలో బాలయ్య సగం రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నాడు.
READ ALSO : ప్రభాస్ సొంత అన్న సినిమాల్లోకి ఎందుకు రాలేదు.. అసలు ఆయన ఏం చేస్తారు !