Advertisement
Swathi Muthyam Movie Telugu Review: గణేష్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలసి నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. వర్ష బోల్లమ్మ ఈ చిత్ర కథానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వినోదభరితమైన ఈ కుటుంబ కథా చిత్రం విజయదశమి కానుకగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Advertisement
Swathi Muthyam Movie Telugu Story: కథ:
బాలమురళీకృష్ణ (గణేష్ బెల్లంకొండ) చాలా మంచోడు. జీవితంలో అమ్మాయిలకు దూరంగా ఉంటూ స్వాతిముత్యం మిగిలిపోతాడు. అయితే, బాలమురళీకృష్ణ పెళ్లి చేసుకునే క్రమంలో భాగ్యలక్ష్మి (వర్ష బొల్లమ్మ) ను పెళ్లి చూపుల్లో భాగంగా కలుసుకుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలమురళీకృష్ణ – భాగ్యలక్ష్మి ప్రేమలో పడి పెళ్లికి రెడీ అవుతారు. అయితే, సాయంత్రం పెళ్లి అనగా బాలమురళీకృష్ణ గురించి ఒక షాకింగ్ విషయం తెలుస్తోంది. దెబ్బకు పెళ్లి రద్దు అవుతుంది. ఇంతకీ ఏమిటి ఆ రహస్యం? ఆ తర్వాత బాలమురళీకృష్ణ జీవితంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? చివరకు బాలమురళీకృష్ణ – భాగ్యలక్ష్మి పెళ్లి అయిందా? లేదా? అనేది మిగిలిన కథ.
Advertisement
Swathi Muthyam Movie Telugu Review: “స్వాతి ముత్యం” మూవీ రివ్యూ
కొత్త కుర్రాడు అయినా గణేష్ మొదటి సినిమాతోనే మంచి నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్నాడు. పాత్రకు ప్రాణం పోశాడు. ఇక డైరెక్టర్ కూడా ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా అందరికీ కథలో స్పేస్ ఇచ్చాడు. దాంతో హీరోయిన్ గా చేసిన వర్షా బోల్లమ్మకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇక వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ బాగుంది. మిగతా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
ప్లస్ పాయింట్స్: కథ, కథనం
లెంత్ తక్కువ ఉండటం
నటీనటుల నటన
మైనస్ పాయింట్స్:
కొన్ని సీన్లలో సాగదీత
రేటింగ్: 2.75/5
read also : కేజీఎఫ్ 2 విజయం వెనుక నటుడు కైకల హస్తం…?