Advertisement
మనకి వాటర్ ట్యాంక్స్ ఎంత అవసరమనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీళ్లు కావాల్సి వచ్చినప్పుడల్లా బోరింగ్ పంపు కొట్టడం లేక బావి నుంచి తోడుకోవాల్సిన అవసరము లేకుండా చేయడం కోసం వాటర్ ను మోటర్ సాయంతో ట్యాంకులో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటూ ఉంటున్నాం. అయితే వాటర్ ట్యాంకులను గమనిస్తే వాటిలో నీరు వెళ్లడానికి ఒక ఇన్ ఫ్లో, ట్యాంక్ నిండిన తర్వాత బయటకు రావడానికి ఒక అవుట్ ఫ్లో ఉంటుంది. వీటి ఉపయోగాలు మనందరికీ తెలిసిందే. అయితే వీటితో పాటు ట్యాంక్ పక్కన మరో పైపు ను ఎప్పుడైనా గమనించారా?
Advertisement
‘టి’ ఆకారంలో ఉండే ఈ పైపును కచ్చితంగా ట్యాంకులకు ఏర్పాటు చేస్తారు. అయితే దీని ఉపయోగం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? దాని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా కాళీ ట్యాంకులో ఎంతో కొంత గాలి ఉంటుంది. ట్యాంకులోకి నీరు నిండుతున్న సమయంలో అప్పటికే ట్యాంక్ లో ఉన్న గాలి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసమే ఈ టి ఆకారం పైపు ను ఏర్పాటు చేస్తారు. ట్యాంకు ఎత్తు నుంచి నీరు లోపలికి పడితే ఒక్కసారిగా ట్యాంకులో ప్రెషర్ పెరుగుతుంది.
Advertisement
దీంతో ఈ గాలిని బయటకు పంపేందుకు టీ షేప్ పైప్ ఉపయోగపడుతుంది. ట్యాంకు లోపలికి నీరు బలంగా పడే సమయంలో నీటి కంటే గాలి బరువు తేలికగా మారి ఈ పైపు ద్వారా బయటకు వెళుతుంది. గాలి బయటకు వెళ్లకపోతే నష్టమేంటని ఆలోచిస్తున్నారు కదూ, ఒకవేళ ఈ పైపు లేకపోతే ట్యాంక్ లో ఒత్తిడి బాగా పెరిగి ఒకానొక సమయంలో ట్యాంక్ పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ట్యాంక్ లో నుంచి నీటి బయటకు నీటి సరఫరా సజావుగా జరగదు. అందుకే కచ్చితంగా ట్యాంక్ లకు టీ షేప్ పైపు ను ఏర్పాటు చేస్తారు.
Read also : ఎన్టీఆర్ ట్రస్ట్ వివాదంపై ఎన్టీఆర్ కి రాసిన ఓపెన్ లెటర్ ! అతను చెప్పేది నిజామా కాదా ?