Advertisement
ఆచార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన ఓ గొప్ప జీవిత కోచ్ గా పేరు తెచ్చుకున్నాడు. తన ప్రత్యేక విధానాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. గొప్ప వ్యూహకర్తగా భావించే చాణక్యుడి వల్ల నందవంశం నాశనమైంది. చాణక్యుడికి రాజకీయాలే కాకుండా సమాజానికి సంబంధించిన ప్రతి విషయంపై లోతైన జ్ఞానం ఉంది. ఆచార్య చాణక్య నీతి శాస్త్రం అనే పుస్తకంలో ఆర్థిక విషయాలు, సంబంధాలు తదితర విషయాల గురించి ప్రస్తావించాడు. అయితే.. మనిషి సహాయం చేయాల్సిన సమయంలో సమయస్ఫూర్తితో మాట్లాడుతూ, సహాయం చేయని వారి గురించి ఆచార్య చాణక్య ప్రస్తావించారు. మనిషిలో మోసగాళ్లను కొన్ని సంకేతాల ద్వారా గుర్తించవచ్చునని చాణక్య పేర్కొన్నారు. అవి ఏమిటో ఈరోజు తెలుసుకుందాం.
Advertisement
Advertisement
సమయం సందర్భం లేకుండా, మెలికలు తిరుగుతూ మాట్లాడే వాళ్లను మనం చూస్తూనే ఉంటాం. మన చుట్టుపక్కల ఇలా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారి మనసులో ఒకటి అనుకుంటారు. బయటకు ఒకటి వ్యక్తం చేస్తారు. అలాంటి వారిని నమ్మడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి అలాంటి వారికి వీలైనంత దూరం పాటించండి. చాలామంది తమ పని పూర్తయిన తర్వాత పనికి సాయం చేసిన వారిని విస్మరించే కొందరు విశ్వాసం లేని వ్యక్తులు ఉన్నారు.
మీరు అలాంటి వ్యక్తుల నుండి సహాయం కోరినప్పుడు, లేదా వారి నుంచి మంచిని ఆశించినప్పుడు, ఎల్లప్పుడు మోసం చేయాలని ఆలోచిస్తారు. అటువంటి నేచర్ కలిగిన వారిని వీలైనంత త్వరగా వదిలించుకోవడం, లేదా వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమయంలో ఇతరుల సహాయం అవసరం అవుతుంది. ఎవరికైనా ఇతరుల సహాయం ఏర్పడుతుంది. మీ అవసరాలకు ఇతరులు మద్దతు లభించినప్పుడు అతను మీ శ్రేయోభిలాషి కాదని అర్థం చేసుకోండి. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. అలాంటి వ్యక్తులు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. కనుక స్వార్థపూరిత మనుషులకు వీలైనంత దూరంగా ఉండటమే తెలివైన పని.
READ ALSO : వాటర్ ట్యాంక్పై ఈ పైప్ ఎందుకు ఉంటుందో తెలుసా ?