Advertisement
సాధారణంగా కళ్ళ ముందు ఏదైనా అకస్మాత్తుగా ప్రమాదం జరిగినట్లయితే మనం ప్రాణాలకి తెగించి కాపాడేవారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ సాయం చేస్తారు. అయితే ఇక్కడ ఓ మహిళ మాత్రం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నడిరోడ్డుపై చీర విప్పి ప్రాణాలను కాపాడింది. తన చీరతో ఐదుగురి ప్రాణాలను కాపాడి అందరి ప్రశంసలను అందుకుంటుంది ఈ మహిళ. ఇటీవల బెంగళూరులో కురిసిన భారీ వర్షాల వల్ల కె.ఆర్ కూడలి సమీపంలో అందరి పాస్ వరద నీటిలో కారు చిక్కుకుపోయింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన భాను రేఖ అనే కన్నుమూసింది. ఆ వరదలో ఆరుగురు చిక్కుకోగా వారిలో ఒక మహిళ మృతి చెందింది. మిగిలిన ఐదుగురిని ప్రాణపాయం నుంచి కాపాడింది బెంగళూరు రెస్క్యూ టీమ్ అయినప్పటికీ వారు వచ్చేంతవరకు వరదలో కొట్టుకుపోకుండా కాపాడింది మాత్రం ఒక మహిళ.
Advertisement
కె.ఆర్ కూడలిలోని అండర్ వద్ద ఏదో గొడవగా ఉన్నదని అదే మార్గంలో వెళ్తున్న ఓ మహిళ గుర్తించింది. వర్షం నీటితో నిండిపోయిన అండర్ పాస్ లో మీడియా ప్రతినిధి ఒకరు ఈత కొడుతూ మునిగిన కారులో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. వారిని కాపాడడానికి ఒక తాడు అవసరం కావడంతో ఎవరైనా సహకరించాలని ఆ యువకుడు అడిగాడు. ఆ సమయంలో అందరూ నిస్సహాయులై చూస్తున్నారే తప్ప ఎవ్వరు కూడా సహాయం చేసే ప్రయత్నం మాత్రం చేయలేదు. అప్పుడే అక్కడికి ఓ మహిళ వచ్చి తన ఒంటిపై ఉన్న చీరను విప్పి ఓ కొంగుని ఆ యువకుడికి అందించింది. చీర మరో కొసను అండర్ పాస్ కున్న ఇనుప చూపులకు కట్టింది.
Advertisement
ఆ మహిళా చీరను ఆసరాగా చేసుకొని నీటిలో ఉన్నవారు ఒక్కొక్కరుగా బయటికి వచ్చారు అక్కడ ఉన్నవారు అందరూ ఆ మహిళ చూపిన ఆ మహిళ చేసిన సహాయానికి అభినందించారు. మరో మహిళ తన వద్ద ఉన్న దుపట్టాను ఆమెకు అందించగా మరో వ్యక్తి తన చొక్కాను విప్పి ఆ మహిళకు ఇచ్చాడు. ఆ క్షణంలో మహిళ అందించిన చీర ఐదుగురి ప్రాణాలను నిలిపింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒకవేళ సమయానికి ఆ మహిళా సాయం చేసి ఉండకపోతే మాత్రం ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి.
మరికొన్ని ముఖ్య వార్తలు :
పెళ్లి అయిన తరువాత ప్రియుడిని నమ్మి రూమ్ కి వెళ్తే ఏం జరిగిందంటే ?
అంత్యక్రియల సమయంలో కుండలో నీరు పోసి రంద్రాలు పెట్టి పగలగొట్టడానికి కారణం ఏంటో తెలుసా ?