Advertisement
భార్యాభర్తల మధ్య అయినా ప్రేమికుల మధ్య అయినా నమ్మకం అనేది చాలా ముఖ్యం. నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అలానే మరొకరిని నమ్మాలి. నమ్మకం లేకపోతే ఏ బంధమైనా సరే ముక్కలైపోతుంది. అందులో సందేహమే లేదు. కానీ ఈ రోజుల్లో చాలామంది పెళ్లి తర్వాత మరొకరితో సంబంధం పెట్టుకోవడం వంటివి చేస్తున్నారు. అలానే ఈ రోజుల్లో చాలామంది ప్రేమ పేరుతో మోసపోతున్నారు. ముఖ్యంగా యువతులు ప్రేమ పేరుతో మోసపోతున్నారు. ప్రేమ పెళ్లిళ్లపుడు కచ్చితంగా తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఆలోచించి పెళ్లి చేసుకోవాలి.
Advertisement
ఎక్కువమంది అమ్మాయిలు మోసగాళ్ల మాయమాటలకి లొంగిపోతున్నారు కాబట్టి కచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి. ప్రేమ పేరుతో ఒక యువకుడితో ఆమె శారీరకంగా దగ్గర అయింది. కులం పేరుతో వివాహానికి అతను నిరాకరించాడు. ఇక పూర్తి వివరాలకు వెళితే… అమృత అనే ఒక అమ్మాయి ఒక అతన్ని ప్రేమించి శారీరకంగా దగ్గర అయింది. కానీ కులం పేరుతో అతను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.
Advertisement
కర్ణాటకలోని బళ్లారిలో ఇది చోటుచేసుకుంది. అమృత చనిపోయే ముందు ఒక సూసైడ్ నోట్ ని రాసి ప్రియుడు చేసిన మోసం గురించి చెప్పుకొచ్చింది. అమృతకి తన స్నేహితురాలు మరిది సునీల్ తో పరిచయం ఏర్పడింది. తర్వాత ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు. పెళ్లి గురించి మాట్లాడితే కులం అతనికి అడ్డు వచ్చింది.
దీనితో అమృత తను ప్రేమించిన సునీల్ ని నిలదీసి ప్రశ్నించింది అయినా కూడా ఆమెని వదిలేసాడు. దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. కొనఊపిరిలో ఉన్న అమృత ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి ఆమె చనిపోయింది. ఆమె రాసిన ఉత్తరం పోలీసులకి దొరికింది. సునీల్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Also read: