Advertisement
వారిద్దరూ ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ప్రేమ పేరుతో చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఆ తరువాత నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. నిశ్చితార్థం తరువాత మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు ఆ యువకుడు. ఈ విషయం తెలిసిన ప్రియురాలు తట్టుకోలేకపోయింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు కొకొల్లలుగా చోటు చేసుకోవడం గమనార్హం. అక్కడ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇలాంటి సంఘటనలు ఈరోజుల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. తాజాగా చోటు చేసుకున్న ఈ సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
కర్నూలులోని పీవీ నరసింహారావు కాలనీకి చెందిన మల్లెపోగు మధు, షేకమ్మ దంపతుల కుమార్తె పద్మావతి(30) డిగ్రీ పూర్తి చేసి ఓ వాహన షోరూంలో పదేళ్ల నుంచి పని చేస్తుంది. ఐదేళ్ల కిందటే నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాతకోటకు చెందిన వినోద్ కుమార్ అలియాస్ ప్రవీణ్ కుమార్ అదే షోరూంలో చేరాడు. ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. వినోద్ శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ పరిధిలోని కియా షోరూంలోకి మారాడు. అయినప్పటికీ తరచూ పద్మావతికి ఫోన్ లో టచ్ లోనే ఉండేవాడు. తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పడంతో మార్చి 09న నిశ్చితార్థం చేశారు. రూ.లక్ష నగదు, బంగారం కట్నంగా ఇస్తామని పద్మావతి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. జూన్ 10న వివాహం జరుగనుందని లగ్నపత్రిక కూడా రాయించారు. పద్మావతి తనకంటే వయస్సులో నాలుగేళ్లు పెద్దదని.. బలవంతంగా నిశ్చితార్థం చేశారంటూ వినోద్ కుమార్ జూపాడు బంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశాడు. మే 29న వెంకాయపల్లె ఎల్లమ్మ ఆలయంలో మరో యువతిని పెళ్లి చేసుకున్నట్టు సమాచారం ఇచ్చాడు.
Advertisement
దీంతో పద్మావతి తల్లిదండ్రులు దిశా మహిళా పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. విచారణ జరగాల్సి ఉన్న సమయంలోనే పద్మావతి విషద్రావణం తాగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించి తిరిగిరాని లోకాలను వెళ్లిపోయింది. ఎస్సై మోహన్ కిశోర్ రెడ్డి ఆమె తల్లిదండ్రులను విచారించగా.. ఆమె రాసిన ఓ లేఖ లభ్యమైంది. అందులో ‘అమ్మా.. నాన్న నన్ను క్షమించండి. మీరు చెప్పిన మాట విననందుకు నాకు తగి శాస్త్రీ జరిగింది. నా గురించి మీరు అస్సలు బాధపడకండి. తమ్ముడు, చెల్లి గురించి ఆలోచించండి. నా చావుకు కారణం వినోద్ కుమార్. అతన్ని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటానని ఐదేళ్లు నా వెంట తిరిగాడు. నిశ్చితార్థం చేసుకొని.. లగ్న పత్రిక రాయించుకొని పెళ్లి పత్రికలు కూడా ప్రింట్ చేయించిన తరువాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని నన్ను మోసం చేశాడు. వినోద్, అతని తల్లిదండ్రులు లక్ష్మీదేవి, బక్కన, భావ శోభన్, చిన్నాన్న మధుబాబు, ఐదుగురు మేనత్తలు నా చావుకు కారణం’ అని పేర్కొంది. పోలీసులు వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఆదిపురుష్ ట్రైలర్ లో మనకు కనిపించిన 5 మైనస్ పాయింట్స్ ఇవేనా ?
రైలుకి వెనుక వైపు ఉండే ఈ గుర్తులకు అర్థం ఏంటి ? X, LV అనే పదాలు కనిపించపోతే..!