Advertisement
ఆధార్ కార్డు.. ప్రస్తుతం ప్రతి పనికీ ఇదే ఆధారమైంది. అందుకే ఎప్పుడూ అప్ డేట్ లో ఉంచుకోవాలి. ఈమధ్యే యూఐడీఏఐ కీలక సూచనలు చేసింది. పదేళ్లు దాటిన ఆధార్ ను మస్ట్ గా అప్డేట్ చేసుకోమని చెప్పింది. ఆధార్ పొందినప్పటి నుంచి.. ఇప్పటివరకు వివరాలను అప్డేట్ చేసి ఉండనట్లయితే, వెంటనే వారంతా వివరాలను ఆన్ లైన్ ద్వారా కానీ, ఆఫ్ లైన్ ద్వారా కానీ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. అంటే, గుర్తింపు వివరాలు మారినా, చిరునామా మారినా, మొబైల్ నెంబర్ మారినా, మరే ఇతర వివరాలు మారినా, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లతో ఆధార్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
Advertisement
ఈ నేపథ్యంలో ఏపీలో ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ, వార్డు సచివాలయాలు, పాఠశాలల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఈనెల 24వ తేదీ వరకు ఈ అవకాశం కల్పించింది. అలాగే రెండో విడతగా ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు సేవలు అందించనుంది. పదేళ్లుగా అప్డేట్ చేసుకోని వారికోసం ప్రత్యేకంగా ఈ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
Advertisement
ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు దొర్లితే అప్డేట్ చేసుకోవచ్చని ప్రకటించింది. జనవరి 19, 20, 21, 23, 24 తేదీల్లో వరుసగా ఐదు రోజుల పాటు ఆధార్ అప్డేట్ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాల్లో ప్రత్యేక క్యాంప్ లు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ఆధార్లో ఎవైనా తప్పులు దొర్లితే ఏన్నో పనులు పెండింగ్ లో పడిపోతుంటాయి. ఆధార్ సెంటర్లకు వెళితే అక్కడ రద్దీ రిత్యా పనులు సకాలంలో అవక ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది ఆధార్ అప్డేట్ చేసుకోని వారున్నట్లు సమాచారం. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ప్రత్యేక క్యాంపులతో చర్యలకు పూనుకుంది ప్రభుత్వం.