Advertisement
మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఇబ్రహీం పట్టణంలోని జోగి రమేష్ నివాసంలో 15 మంది ఏసీబీ అధికారులు ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ భూములకు వ్యవహారంలో ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. సీఐడీ స్వాధీనంలో ఉన్న భూములు కబ్జా చేశారని ఆరోపణలు ఉండడంతో కుటుంబీకులపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలోనే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలైతే తెలియాల్సి ఉంది. 15 మంది ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకుని సోదాలు చేపట్టారు.
Advertisement
అంబాపురంలోనే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఈ తనిఖీలు జరుపుతున్నట్లు సమాచారం సీఐడీ జప్తులో ఉన్న భూములను కొనుగోలు చేసి విక్రయించాలని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం 5 గంటల నుండి ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. అగ్రిగోల్డ్ భూముల క్రయవిక్రయాల్లో గోల్ మాల్ జరగలేదని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. తన తండ్రి పై కక్షతోనే తనను అరెస్ట్ చేశారని జోగి రాజీవ్ అన్నారు.
Advertisement
Also read:
Also read:
తండ్రి పై కక్షతోనే అరెస్ట్ చేశారని ఆరోపించారు. అందరూ కొన్నట్లే తాము భూములు కొనుగోలు చేశామని అన్నారు. అగ్రిగోల్డ్ కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని జోగిరాజు తెలిపారు. తమపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు ఇంకోపక్క అగ్రిగోల్డ్ భూములు ఆల్రెడీ అటాచ్ లో ఉన్నాయని అటాచ్మెంట్ లో ఉన్న భూమిని ఎవరైనా కొంటారా అని జోగి రమేష్ ప్రశ్నించారు. నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తారా..? కక్ష ఉంటే నాపై తీర్చుకోవాలని అన్నారు. తప్పు చేస్తే ఉరేసుకుంటానని జోగి రమేష్ చాలెంజ్ చేశారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!