Advertisement
ఆచార్య చాణిక్యుడు మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తననీతి శాస్త్రంలో తెలియజేశారు. అలాంటి చానిక్యుడి నీతి ప్రకారం ఒక మనిషిని మన దారిలోకి తెచ్చుకోవాలంటే ఎలాంటి విధానాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.. ప్రపంచంలో ఏ ఒక్కరి మనస్తత్వాలు ఒకే విధంగా ఉండవు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన లక్షణాలను కలిగి ఉంటారు. అలాంటి వారిని మన దారిలోకి తెచ్చుకోవడం కష్టంగా ఉంటుంది. మరి ఇలాంటి మనస్తత్వం ఉన్న వారిని మన దారిలోకి ఎలా తెచ్చుకోవాలంటే..
Advertisement
also read: మీ పూర్వీకుల ఫోటోలను దేవుడు గదిలో పెడుతున్నారా? అయితే ఏమవుతుందో తెలుసా..?
కోపంగా ఉండే మనస్తత్వం ఉన్న వారి ఎదుట చాలా మర్యాదగా ప్రశాంతంగా ప్రవర్తించాలి. ఎల్లప్పుడు కోపాన్ని ప్రదర్శించకూడదు. దీంతో వారు ఆటోమేటిక్ గా కూలై శాంతిస్తారు. ఈ క్రమంలోనే మన దారికి వస్తారు. మూర్ఖపు స్వభావం ఉన్న వారిని ఎల్లప్పుడూ పొగుడుతూ ఉండాలట. వారిని ఎప్పుడూ ఫాలో కావాలట. దీనివల్ల వారు ఆటోమేటిక్ గా మన కంట్రోల్లోకి వచ్చేస్తారని అంటున్నారు. ఒకవేళ మనం ముందు ఎవరైనా ప్రతిభావంతులైన వ్యక్తులు ఉంటే వారితో ఎల్లప్పుడు నిజాలే మాట్లాడాలట.
Advertisement
also read: పుష్ప 2 టీజర్లో సుకుమార్ చూపెట్టిన ఈ లాజిక్స్ క్రియేటివిటీ క్యాచ్ చేశారా?
దీంతో వారు మన పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తూ మన దారిలోకి వస్తారు. అలాగే ఈగో ఎక్కువగా ఉన్నవారిని మన దారిలోకి తెచ్చుకోవాలంటే వారితో ఎల్లప్పుడు మర్యాదగా ఉంటూ అదేవిధంగా ప్రవర్తించాలి. దీంతో వారు ఆటోమెటిగ్గా మన మాట వింటారు. స్వార్థం ఉన్న వారిని అత్యాశపరులను సులభంగా బుట్టలో పడేయవచ్చు. వీరికి కొంత ధన ఆశ చూపితే చాలు మన దారిలోకి వస్తారు. ఇక చిన్న పిల్లలను తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలతో మన దారిలోకి తీసుకోవచ్చు. ఈ విధమైన చిట్కాలతో ఎదుటివారిని మన దారిలోకి తెచ్చుకోవాలి.
also read: విడాకుల సమయం కంటే ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నా – సమంత