Advertisement
హిందూ ధర్మంలో ఏదైనా పూజ లేదా వ్రతాలు వంటివి చేసినప్పుడు ఆచమానం చేస్తారు ఇంతకీ అసలు ఆచమానం ఎందుకు చేయాలి..? దాని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. ఆచమానాన్ని సంస్కృతంలో గోకర్ణకృతి హస్తేనా మాశం మగ్నజలం విభేతని గా వర్ణించారు. చేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి ఇందులో మూడు ఉద్ధరణల నీళ్లు పోసి వాటిని తాగాలి. చేతిలో పోసే నీళ్లు మరీ ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండకూడదు. ఒకే విధంగా ఉండాలని పెద్దలు అంటూ ఉంటారు.
Advertisement
నిజానికి మన గొంతు ముందు భాగంలో నుంచి శబ్దాలు వస్తాయి దీనిని స్వర పేటిక అంటారు. కవచం ఉంటుంది, కనుక కొంతవరకు రక్షణ లభిస్తుంది. అయినా కూడా అది సున్నితంగా ఉంటుంది. గొంతు స్థానంలో చిన్న దెబ్బ తగిలిన ప్రమాదమే స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు. ఒక్కోసారి ప్రాణం కూడా పోవచ్చు. స్వరపేటిక లోపల భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి. ఇంగ్లీష్ అక్షరం వి ఆకారంలో పరస్పరం కలిసిపోయి ఉంటాయి. ముక్కు, నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు, అంగిలి, కొండనాలుక ఉన్న ప్రదేశం ఇవన్నీ కూడా నాజూగ్గా ఉంటాయి. వీటికి బలం కలిగించడం ఆచమానం యొక్క ఉద్దేశం.
Advertisement
Also read:
Also read:
ఆచమానంలో మూడు ఉద్ధరణలు నీళ్లు తాగుతారు మంత్రం చెప్పే ముందు గొంతులో నుంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడ ఉన్న గాలి బయటికి వస్తుంది. ఇలా లోపల నుండి గాలి బయటికి వచ్చినపుడు అందులో వేగం ఉండకూడదు. శబ్దం సులువుగా స్పష్టంగా రావాలి. మెల్లగా నీళ్లు తాగడం వలన గొంతు ఇతర అవయవాల వ్యాయామం చేసినట్లు అవుతుంది. మన చేతుల్లో కొంత విద్యుత్ ప్రవహిస్తుంది. చేతిలో నీళ్లు పోసుకుని తాగడం వలన ఆ నీరు విద్యుత్తుని పీల్చుకుని నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వ ఉండాలి. సమ ధాతుగా ఉండేటట్టు చేస్తుంది కొద్ది కొద్దిగా నీళ్లు సేవించడం వలన కొద్దిపాటి విద్యుత్తు పెదాలు, నాలుక, గొంతు ఇలా సున్నితమైన అవయవాలను ఉత్తేజపరుస్తుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!