Advertisement
ఇండస్ట్రీలో అవకాశాలు రావడం ఒక ఎత్తైతే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ టాప్ హీరోగా మారిపోవడం మరో ఎత్తు. షార్ట్ ఫిలిమ్స్ నుండి సినిమాల్లోకి వచ్చిన స్టార్లు చాలామంది ఉన్నారు. అలా షార్ట్ ఫిలిమ్స్ నుండి వచ్చే హీరోలుగా మారిన వాళ్ళ వివరాలను చూద్దాం.
Advertisement
కిరణ్ అబ్బవరం:
రాజా వారు రాణి వారు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. షార్ట్ ఫిలిమ్స్ నుండి కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీకి వచ్చారు.
చాందిని చౌదరి:
ఈమె కూడా షార్ట్ ఫిలిమ్స్ నుండి సినిమాల్లోకి వచ్చారు మంచి పేరు తెచ్చుకున్నారు. కలర్ ఫోటో, మను వంటి సినిమాల్లో నటించారు.
విజయ్ సేతుపతి:
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలుపెట్టిన విజయ్ సేతుపతి నెమ్మదిగా సినిమాలు లోకి వచ్చారు. తర్వాత గొప్ప స్టార్ హీరోగా మారిపోయారు.
పూజిత పొన్నాడ:
ఈమె పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత కల్కి, బ్రాండ్ బాబు వంటి సినిమాల్లో నటించి అందరికీ దగ్గరయ్యారు.
సుహాస్:
చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా మారిపోయారు సుహాస్ గతంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించారు. ఇప్పుడు సినిమాల్లో వరుస విజయాలు పొందుతూ దూసుకు వెళ్తున్నారు.
రీతూ వర్మ:
Advertisement
ఈమె షార్ట్ ఫిలింస్ తో గుర్తింపు తెచ్చుకుని నెమ్మదిగా సినిమాల్లోకి వచ్చారు. హీరోయిన్ గా అవకాశాలను పొందుతూ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు.
విశ్వక్సేన్:
పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి తర్వాత సినిమాలు లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
నవీన్ పోలిశెట్టి:
ఇంజనీరింగ్ గురించి చేసిన ఒక వీడియో ద్వారా నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు నవీన్. తర్వాత నెమ్మదిగా సినిమాల్లోకి వచ్చి హీరోగా మారిపోయారు.
Also read:
రాజ్ తరుణ్:
కెరియర్ మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన రాజ్ తరుణ్ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో నటిస్తూ మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు.
ప్రియాంక జవల్కర్:
ఈమె కూడా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింప తెచ్చుకున్నారు. నెమ్మదిగా ఇండస్ట్రీలోకి వచ్చారు.
వైష్ణవి చైతన్య:
వెబ్ సిరీస్ ల ద్వారా గుర్తింపు తెచ్చుకుని బేబీ సినిమాతో హీరోయిన్గా మారిపోయారు.
విజయ్ దేవరకొండ:
కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే షార్ట్ ఫిలింలో ఈయన నటించారు తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో పెద్ద హీరోగా మారిపోయారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!