Advertisement
ఎప్పుడు మృతువు ఎలా ఎవరికి వస్తుంది అనేది ఎవరు చెప్పలేము. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా ప్రమాదవశాత్తు హఠాత్తుగా చనిపోవచ్చు. సినిమా సెలబ్రిటీలు మనకి వ్యక్తిగతంగా పరిచయం ఉండరు. అయినా సరే వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినప్పుడు మనకి ఏదో బాధ ఉంటుంది. ఎంతోమంది సినీ తారలు చిన్నవయసులోనే తుది శ్వాస విడిచారు అలా చనిపోయిన కొంతమంది నటులు వీళ్లు.
Advertisement
సావిత్రి (1936 – 1981) 45 ఏళ్ళు:
సావిత్రి కొన్ని అలవాట్ల కారణంగా అనారోగ్యంతో బాధపడ్డారు. తర్వాత కోమాల్లోకి వెళ్లిపోయారు కోమాలో ఏడాది ఉన్న సావిత్రి ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
కునాల్ (1977–2008) – 30 ఏళ్ళు:
ప్రేమికుల రోజు సినిమాతో అందరికీ దగ్గరైన కునాల్ కూడా చిన్న వయసులోనే చనిపోయారు. ఆర్థిక ఇబ్బందులు వ్యక్తిగత జీవితంలో సమస్యల వలన ఆత్మహత్య చేసుకున్నారు.
భార్గవి (1983–2008) – 25 ఏళ్ళు:
అష్టా చమ్మా సినిమాలో నానికి చెల్లెలుగా నటించిన భార్గవి కూడా ఆత్మహత్య చేసుకునే చనిపోయారు. తన బాయ్ ఫ్రెండ్ తో పాటు ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.
విజయ్ సాయి – 38 ఏళ్ళు:
అమ్మాయిలు అబ్బాయిలు మొదలైన చిత్రాల్లో నటించిన విజయ్ సాయి కూడా సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. చిన్న వయసులోనే చనిపోయారు విజయసాయి కూడా.
యశో సాగర్:
యశో సాగర్ 2012లో తదుపరి సినిమా షూటింగ్ కి వెళ్తున్నప్పుడు కారు ప్రమాదంలో చనిపోయారు.
సౌందర్య (1972–2004) – 31 ఏళ్ళు:
సౌందర్య మంచి పేరు తెచ్చుకున్న నటి. ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీకి తన వంతు మద్దతుగా ప్రచారం చేయడానికి వెళ్లి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు సౌందర్య.
ప్రత్యూష (1981–2002) – 20 ఏళ్ళు:
ప్రత్యూష కూడా చిన్న వయసులోనే చనిపోయారు. ఆమె చనిపోయినప్పటికీ ఆమె వయసుకు 20 సంవత్సరాలు.
Advertisement
ఉదయ్ కిరణ్ (1980–2014) – 33 ఏళ్ళు:
ఉదయ్ కిరణ్ ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి కష్టపడి మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కానీ కొన్ని రకాల ఇబ్బందుల వలన ఉరి వేసుకుని ఉదయ్ కిరణ్ చనిపోయారు.
జియాఖాన్:
ప్రేమించిన వ్యక్తితో గొడవలు వచ్చి మనస్పర్దానికి గురై జియాఖాన్ చనిపోయారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ – 34 ఏళ్ళు:
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డిప్రెషన్ తో బాధపడి ఉరి వేసుకుని చనిపోయారు.
దివ్యభారతి (1974–1993) – 19 ఏళ్ళు:
దివ్యభారతి చిన్న వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఈమె కూడా అయితే ఒకరోజు పై అంతస్తులు ఉంటున్నప్పుడు బాల్కనీలో నుండి ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడిపోయారు.
ఆర్తి అగర్వాల్ (1984–2015) – 31 ఏళ్ళు:
ఆర్తి అగర్వాల్ కి ఆపరేషన్ జరిగినప్పుడు అనారోగ్య సమస్యలు కలగడంతో ఆమె చనిపోయారు. ఆమె వయస్సు అప్పటికి 31 సంవత్సరాలు మాత్రమే.
పునీత్ రాజ్‌కుమార్ (1975-2021) – 46 ఏళ్ళు:
గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ చిన్న వయసులోనే చనిపోయారు. జిమ్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా కూలబడిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.
సిల్క్ స్మిత (1960–1996) – 35 ఏళ్ళు:
సిల్క్ స్మిత కూడా చిన్న వయసులోనే చనిపోయారు. ఆత్మహత్య చేసుకుని ఆమె చనిపోయారు అయితే ఇప్పటికి కూడా ఆమె ఎందుకు చనిపోయారు అనేదానికి కారణం తెలియదు.
Also read: