Advertisement
రామాయణం ఎప్పుడూ కూడా ఎవరి గ్రీన్ సబ్జెక్ట్. ఒక మూవీకి కావాల్సినవి అన్ని అందులో ఉంటాయి. ప్రతి హీరో లైఫ్ లో ఒక్కసారైనా రాముడు పాత్ర చేయాలి అనుకుంటూ ఉంటారు. ఇప్పటివరకు రాముడు పాత్రలో మెప్పించిన వారి గురించి మనం ఇప్పుడే చూసేద్దాం. వాల్మీకి రచించిన రామాయణానికి వందలాది మంది దర్శకులు వెండితెర రూపాన్ని ఇచ్చారు. రాముని పాత్రకి ఎన్టీఆర్ ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ఏ కాకుండా చాలామంది హీరోలు రాముడి పాత్రలో నటించి మెప్పించారు.
Advertisement
ఎడవల్లి సూర్యనారాయణ
1932లో శ్రీరామ పాదుకాపట్టాభిషేకం టైటిల్తో వచ్చిన సినిమాలో నటించారు. శ్రీరామునిగా నటించిన మొదటి నటుడుగా రికార్డులకు ఎక్కారు.
సిఎస్ఆర్ ఆంజనేయులు
1945లో పాదుకాపట్టాభిషేకం పేరుతో ఇంకో చిత్రం తెరి మీదకు వచ్చింది. సి ఎస్ ఆర్ ఆంజనేయులు రాముడిగా నటించి అందర్నీ మెప్పించారు.
ఏఎన్ఆర్
ఎన్టీఆర్ కంటే ముందు ఏఎన్ఆర్ రాముడు గా నటించారు శ్రీ సీతారామ జననం మూవీ లో ఏఎన్ఆర్ రాముడి పాత్ర చేశారు.
ఎన్టీఆర్
Advertisement
ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ పెట్టింది పేరు. అందులో రాముని పాత్రకి ఆయన పెట్టింది పేరు. లవకుశ రామాయణం తర్వాత చిత్రాల్లో ఐకానిక్ గా నిలిచిపోయింది.
శోభన్ బాబు
శోభన్ బాబు రామునిగా మెప్పించారు. 1971లో విడుదలైన సంపూర్ణ రామాయణంలో శోభన్ బాబు రాముడు గా నటించారు.
బాలకృష్ణ
బాలకృష్ణ శ్రీరామరాజ్యం సినిమాలో రాముడి పాత్ర పోషించారు. నయనతార సీత పాత్ర పోషించారు.
జూనియర్ ఎన్టీఆర్
పసిప్రాయంలోనే రాముడు గా నటించే అవకాశం జూనియర్ ఎన్టీఆర్ కి దక్కింది. బాల రామాయణం సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రాముడుగా నటించారు.
ప్రభాస్
ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ జూనియర్ రాముడుగా నటించారు రాముడి పాత్ర చేసిన ఈ తరం స్టార్ హీరో ప్రభాస్. అలానే సుమన్, శ్రీకాంత్, హరనాథ్, కాంతారావు కూడా రాముడు పాత్రలలో నటించి అందరినీ ఆకట్టుకున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!