Advertisement
సిద్దు జొన్నలగడ్డ నేహశెట్టి కాంబినేషన్ లో డీజే టిల్లు సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ ఇప్పుడు రాబోతోంది. సినిమాకి వచ్చిన క్రేజ్ వల్లే ఇప్పుడు పార్ట్-2 ని కూడా తెరమీదకి తీసుకువస్తున్నారు. అయితే ఈసారి హీరోయిన్ ని మార్చు చేశారు. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఉన్నారు. ముందుగా వేరే అమ్మాయిని హీరోయిన్ కింద తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఆమె రిజెక్ట్ చేయడంతో అనుపమ పరమేశ్వరన్ కి ఈ అవకాశం వచ్చింది. టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా కనబడుతుండగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ అండ్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవరనాగ వంశీ సినిమాని నిర్మిస్తున్నారు.
Advertisement
మల్లిక్ రామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఐరేని మురళీధర్ గౌడ్ తో పాటుగా నేహశెట్టి సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల చేయాలని మూవీ మేకర్స్ ముందు అనుకున్నారు. కానీ వాయిదా పడుతూ వస్తోంది సినిమా. ఈ సినిమా మార్చి 29న విడుదల కాబోతోంది. ఇప్పటికి ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, గ్లిమ్స్, మోషన్ పోస్టర్లు చూస్తుంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అంతా అంటున్నారు. అందరూ అదే నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాలో ఫస్ట్ వాయిస్ అనుపమ కాదట. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు శ్రీలీలని అనుకున్నారు.
Advertisement
కానీ ఆమె సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు ఆమె దగ్గరికి వెళ్లి ఆఫర్ ఇవ్వగా ముందుగా ఆమె ఓకే చెప్పిందట. కొంచెం సినిమా షూటింగ్ అయిన తర్వాత ఈ సినిమా నేను చేయలేను సారీ అని చెప్పిందట. అందుకు కారణాలు ఏంటి అనేది మాత్రం చెప్పలేదు కానీ శ్రీలీలే నో చెప్పిన తర్వాత అనుపమకి ఈ ఆఫర్ వచ్చింది. ఆమె కూడా చాలా టైం తీసుకుని ఓకే చెప్పింది. కారణం లిప్ లాక్ సీన్లు అని తెలుస్తోంది. అందులో గ్లామర్ షో అధికంగా ఉండడంతో శ్రీలీలే ఇలా చేయలేనని చెప్పిందట. ఇటువంటి సీన్లు ఉంటే తన ఇమేజ్ ఏమవుతుందో అని భావించే శ్రీలీలే ఇలా సినిమా నుండి తప్పుకుంది. ఇదే భయంతో చాలా ఆలోచించి చివరికి ఓకే చెప్పింది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!