Ads
పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ గా మార్చిన “తొలిప్రేమ” చిత్రం ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం. ఏ కరుణాకర్ రెడ్డి దర్శకత్వంలో 1998లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో పవన్ నటనతో పాటు చాలా క్యారెక్టర్లు అభిమానులకు గుర్తుండిపోతాయి. అందులో ఒకటి పవన్ చెల్లెలి పాత్ర. ఈ పాత్రలో తమిళ నటి వాసుకి నటించింది. ఈమె చేసింది ఒకే ఒక్క సినిమా కానీ.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయిపోయింది. నిజంగా ఇంట్లో ఓ చెల్లెలు ఉంటే, అది కూడా వాసుకి లాగే ఉంటే ఎంత బాగుంటుందో అనుకునేలా ఆ పాత్రలో నేచురాలిటీ చూపించింది వాసుకి.
అందుకే ఆ పాత్ర అంతలా మంచి ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో తనకి ఇష్టం లేకపోయినా తనని ప్రేమించే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది వాసుకి. అయితే అక్కడ పవన్ తో ఆమె చెప్పే సెంటిమెంట్ డైలాగ్ లు అందరి హృదయాల్లో నిలిచిపోయాయి. అయితే ఈ సినిమా తర్వాత ఎందుకో తెలియదు కానీ వాసుకి మళ్ళీ సినిమాలలో నటించలేదు. చాలా అవకాశాలు వచ్చినా నటనపై ఆసక్తి చూపించలేదట. ఆ సినిమా సమయంలోనే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని ప్రేమ వివాహం చేసుకొని సెటిలైపోయింది వాసుకి.
Advertisement
Read Also : Telugu cinema news, Telugu News
ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో ఒకరు కొడుకు మరియు ఒక కూతురు ఉంది. ప్రస్తుతం వాసుకి ఐటీ దిగ్గజ కంపెనీ అయిన గూగుల్ లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇద్దరు పిల్లల ఆలనా పాలనలోనూ చాలా బిజీగా ఉంటుంది. ఇక వాసుకి సోషల్ మీడియాలోనూ ఆక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తన పిల్లల ఫోటోలను షేర్ చేస్తుంది. వాసుకి భర్త ఆనంద్ సాయి తొలిప్రేమలో తాజ్ మహల్ సెట్ దగ్గర నుంచి పవన్ సినిమాలైన తమ్ముడు, ఖుషి, జల్సా ఇలా వరుసగా పవన్ సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఇక తెలంగాణ తిరుమల గా ప్రసిద్ధి చెందిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణంలో కూడా ఆనంద్ సాయి తనదైన పాత్ర పోషించారు.
Read also: అబ్బాయిలలో ఈ లక్షణాలు కనిపిస్తే అమ్మాయిలు ఈ జన్మలో వదిలిపెట్టరు.