Advertisement
ఒక రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం అవసరమో చాలామంది చాలా పాయింట్స్ చెప్పారు. కానీ అన్నిటిలోకి స్త్రీలు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసా. కైండ్ నెస్ కి. పార్ట్నర్స్ లో వారు కోరుకునే క్వాలిటీస్ లో అతి ముఖ్యమైనదిగా దీనినే పేర్కొన్నారు. అయితే అబ్బాయిలలో ఈ లక్షణాలు కనిపిస్తే అమ్మాయిలు ఈ జన్మలో వదిలిపెట్టరు. మరి ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలివితేటలు కావాలని కోరుకుంటారు. తెలివితేటలు అంటే ఇక్కడ డిగ్రీలు కాదండి. మేధాశక్తికి, కాలేజీ డిగ్రీలకి సంబంధం లేదు. ఎంత తెలివిగా ఆలోచిస్తారు.
Advertisement
జీవితం పట్ల ఎంత కుతూహలం ఉంది, అన్నదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారట. ఆత్మవిశ్వాసం కూడా ఉండాలని ఎదురు చూస్తారు. ఆత్మవిశ్వాసంతో పాటు వారిలో ఉన్న బలహీనతలని కూడా పైకి చెప్పుకున్న వారిని ఎక్కువ ఇష్టపడతారట. తన పార్ట్నర్ తనని ప్రేమిస్తున్నారు అనే నమ్మకం స్త్రీకి కలగాలి. ఇద్దరి మధ్య ఏ ఆర్గ్యుమెంట్ అయిన స్త్రీకి ఈ నమ్మకం లేకపోవడం వల్లనే వస్తుంది. ఆ నమ్మకం కలిగించవలసిన బాధ్యత పార్ట్నర్ ది. ఆ నమ్మకం ఉన్నప్పుడు స్త్రీ తన పార్ట్నర్ ని ఎంతగానో ఇష్టపడుతుంది. అందరం తప్పులు చేస్తాం.
Advertisement
ఒక్కోసారి తప్పని పరిస్థితి వస్తుంది కూడా. ఆ పరిస్థితులని మీరు అర్థం చేసుకోవాలని ఆమె ఆశిస్తుంది. మీరుఇలాగైతే పర్ఫెక్ట్ కాదో ఆమె కూడా అంతే కదా. క్షమ లేకుండా ఏ బంధం నిలవదు. వివాహ బంధం అసలే నిలవదు. స్త్రీ శరీరంలో జరిగే హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ని మీరు అర్థం చేసుకుని సహకరించాలని ఆమె కోరుకుంటుంది. పీరియడ్స్, ప్రెగ్నెన్సీ, మోనోపాజ్, ఆ టైంలో ఆమె హార్మోన్లలో వచ్చే మార్పులను మీరు వేలాకోలం చేయడం వంటివి చేయకూడదని ఆమె భావన.
READ ALSO : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గర ఉన్న అతి విలువైన వస్తువులు వీటి ధరలు ఎంతంటే ?