Advertisement
టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మి మధ్య ఉన్న చనువుతో.. వారిపై చాలా మంది చాలా రకాలుగా వార్తలు రాశారు. ఇద్దరూ కలిసి ప్రొడక్షన్ హౌస్ నడపడం.. పలు పార్టీల కు అటెండ్ కావడంతో ఈ ప్రచారం సాగింది. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి గుసగుసలు బోలెడన్ని వస్తుంటాయి. వీటిపై ఇప్పటివరకు అటు పూరి కానీ .. ఇటు ఛార్మి కానీ అధికారికంగా స్పందించలేదు. తాజాగా పూరి తన భార్యకు విడాకులు ఇస్తున్నట్టు కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. చార్మి తో కొనసాగుతారని రాస్తున్నారు.
Advertisement
ఈ వార్తలపై తాజాగా పూరి జగన్నాథ్ తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో ఆకాష్ పూరి స్పందించారు. తన పేరెంట్స్ విడాకుల విషయమై తొలిసారి స్పందించారు.’ అమ్మానాన్నల మధ్య గొడవలు, విడాకుల విషయాలు తనకైతే తెలియదని చెప్పిన ఆకాష్ పూరి… వాళ్ళ మధ్య అసలు ఎలాంటి మనస్పర్థలు లేవని’ స్పష్టం చేశారు. విడాకులు అని ప్రచారం చేస్తున్న వారికి అదో టైంపాస్ అంటూ పూరి తనయుడు అసలు నిజాన్ని క్లారిటీ ఇచ్చాడు. అమ్మా ,నాన్న లు ప్రేమ వివాహం చేసుకున్నారని. వాళ్లది ప్యూర్ లవ్ అని ఆకాష్ పూరి తెలిపారు.
Advertisement
నాన్న జేబులో రూ.200 రూపాయలు మాత్రమే ఉన్న సమయంలో ఆయన అడగ్గానే మరో మాటకు తావులేకుండా పెళ్లి చేసుకుందని… నాన్న ఒడిదుడుకుల్లో అమ్మ ఎప్పుడు వెన్నంటే ఉందని ఆకాష్ పూరి తెలిపారు. అమ్మ ఎప్పుడు వీక్ పర్సన్ కాదని… డాడీకి ఫ్యామిలీ టెన్షన్ లేకుండా చేస్తుందని… తనను, తన చెల్లిని బాగా చూసుకొని పెంచిందని ఆకాష్ పూరి తెలిపారు. ఒకానొక సమయంలో నాన్న కారు, ఇల్లు అన్నీ కోల్పోయి ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నా మాకు ఏవి తెలియకుండా అమ్మ జాగ్రత్త పడిందని ఆకాష్ తెలిపారు.
ALSO READ;
అసలు అగ్నిపథ్ స్కీం ఏంటి ? దేశవ్యాప్తంగా ఎందుకు దాన్ని యువత వ్యతిరేకిస్తుంది ?