Advertisement
సినీరంగంలో సెలెబ్రిటీల స్థాయికి ఎదిగిన వారు రాజకీయాల్లోనూ రాణిస్తుండడం మనం చూస్తూనే ఉంటాం. ఎన్టీఆర్ గారు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికవడం కూడా అందరికి తెలిసిన విషయమే. అయితే.. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అక్కినేని నాగేశ్వర్రావు కూడా రాజకీయాల్లోకి రావాల్సి ఉందట.
Advertisement
ఆయనకు కూడా రాజ్యసభ పదవి దక్కాల్సి ఉందట. ఈ విషయాలను ఇటీవల అక్కినేని శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.
నిజానికి ఏఎన్నార్ ఎంపీ కావడం ఇష్టం లేదు. కానీ, బలవంతంగా అయినా సరే ఆయనకు రాజ్య సభ పదవిని కట్టబెట్టాలని అనుకున్నాము. అందుకోసం గట్టిగ ప్రయత్నాలు చేసినప్పటికీ వీలు కాలేదు అంటూ తమ్మారెడ్డి పేర్కొన్నారు. ఆయనకు ఎంపీ పదవి ఇవ్వడం గురించి సినీ వర్గాల్లో గట్టిగానే ప్రయత్నాలు జరిగాయి. ఈ విషయం గురించి ఓసారి ఎన్టీఆర్ వద్ద ప్రస్తావిస్తే.. అంటే ఇప్పుడు నేను అడుక్కుని ఎంపీ అవ్వాలా..? ఏమి అవసరం లేదు.. అంటూ సీరియస్ అయ్యారట.
Advertisement
ఆయన వద్దని చెప్పినా.. ఆ విషయం వదిలిపెట్టలేదని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. అప్పట్లో నేను ఎక్కువ రోజు చంద్రబాబు నాయుడు దగ్గర ఉండేవాడినని.. ఏఎన్నార్ ను ఎంపీ చేసే విషయం గురించి ఆయన వద్ద ప్రస్తావించానని అన్నారు. ఆయన ఎంపీగా ఉంటె సినీ పరిశ్రమకు గర్వకారణంగా ఉంటుంది.. ఇండస్ట్రీ తరపున నేను అడుగుతున్నానని చెప్పారట. అప్పుడు గుజ్రాల్ గారు ప్రధానిగా ఉన్నారు.
చంద్రబాబు ఎన్డీయే రథసారధిగా ఉన్నారు. ఆయన ఏది చెప్తే అది జరిగే పరిస్థితి ఉండేది. అప్పటికే గుజ్రాల్ గారు షబానా ఆజ్మీకి మాట ఇచ్చేశారట. ఇద్దరు సినీ పరిశ్రమకు చెందిన వారు ఎంపీలు గా ఉండడం కుదరదని చెప్పారట. అలా.. ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కినేని నాగేశ్వర్రావు ను ఎంపీగా నామినేట్ చేయడం కుదరలేదు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ మీరు చదవచ్చు ! తెలుగు న్యూస్ కోసం అయితే ఇక్కడ చదవండి !