Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అయితే ఈ ఫ్యామిలీకి పెళ్లిళ్లు అనేది కలిసి రావడం లేదు. ఇందులో నాగార్జున మొదటి వివాహం దగ్గుబాటి రామానాయుడు గారి కూతురు లక్ష్మీతో జరిగింది. ఇక నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ వీళ్లు కూడా నాలుగేళ్లకే విడిపోయారు. అలాగే అఖిల్ కి జరిగిన ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయింది. నాగార్జున మేనల్లుడు సుమంత్ కీర్తి రెడ్డి లు కూడా విడాకులు తీసుకోవడం జరిగింది.
Advertisement
also read:అనుష్క పక్కన అదరగొట్టిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?
ఇక నాగార్జున మేన కోడలు సుప్రియ కూడా పెళ్లి తర్వాత విడాకులు తీసుకుంది. తర్వాత ఆమె మాజీ భర్త చనిపోయాడు. దీన్నిబట్టి నాగార్జున నుండి ఫ్యామిలీకి ఏదో శాపం తగిలినట్టు అంతా గుడ్డిగా నమ్ముతూ ఉన్నారు. అయితే అక్కినేని ఫ్యామిలీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారింది. నాగార్జున మరియు తన పిల్లలు నాగచైతన్య అఖిల్ లకు పెళ్లిళ్లు చేయాలని చూస్తున్నారు. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ కే తన జీవితాన్ని అంకితం చేసిన సుప్రియకి కూడా నాగ్ పెళ్లి చేయాలని భావించినట్టు తెలుస్తోంది. సుప్రియ విషయంలో నాగ్ తన తండ్రి ఏఎన్నార్ కు ఇచ్చిన మాట అని తెలుస్తోంది.
Advertisement
also read: అన్నమయ్య లో సుమన్ నటించిన వెంకటేశ్వర స్వామి పాత్రను మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే ?
ఈ ముగ్గురి పెళ్లిళ్లు వీలైనంత త్వరగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈసారి సినీ ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీతో సంబంధం వద్దని నాగార్జున అనుకుంటున్నారట. అఖిల్ కి సంబంధం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే అంతకంటే ముందు చైతన్యకు కూడా సంబంధం చూడాలి. ఇక సుప్రియ మావయ్య చెప్పినట్టు చేయడానికి రెడీగా ఉంది. ఈ విధంగా అక్కినేని ఫ్యామిలీలో అన్ని అనుకున్నట్టు జరిగితే మూడు పెళ్లిళ్లు ఒక్కసారి జరిగే అవకాశం కనిపిస్తోంది.