Advertisement
టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ (79) తన సినీ ప్రస్తానానికి సెలవు పెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన హఠాన్మరణం రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులను షాక్ కి గురిచేసింది. నానక్రాం గూడా లోని ఆయన ఇంటికి పార్తివదేహాన్ని తరలించారు. ఆ మరునాడు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణ భౌతిక కాయానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
Advertisement
Read also: ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని సూపర్ స్టార్ కృష్ణ రేర్ అండ్ అన్ సీన్ ఫోటోస్..!
మహేష్ బాబు, తండ్రి కృష్ణ చితికి నిప్పు పెట్టారు. నటశేఖరుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో సిని, రాజకీయ ప్రముఖులు అభిమానులు తరలివచ్చారు. ఇక సెలవు అంటూ సూపర్ స్టార్ కు వీడ్కోలు పలికారు. మహేష్ బాబు ఏకంగా ముగ్గురు కుటుంబ సభ్యులకు కోల్పోవడం అందరిలో కన్నీళ్లు తెప్పిస్తుంది. ఈ ఏడాది జనవరి 8న మహేష్ బాబు సోదరుడు, నటుడు, నిర్మాత రమేష్ బాబు కాలయ సంబంధ వ్యాధితో మరణించారు. ఈ బాధ నుంచి ఆయన కోలుకోక ముందే ఆయన తల్లి ఇందిరా దేవి సెప్టెంబర్ 28న అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆ విషాదం నుంచి మహేష్ కోలుకోక ముందే ఇప్పుడు ఆయన తండ్రి కృష్ణ కన్నుమూశారు.
Advertisement
Also Read: ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని సూపర్ స్టార్ కృష్ణ రేర్ అండ్ అన్ సీన్ ఫోటోస్..!
మహేష్ జీవితంలో వరుసగా ఎదురవుతున్న ఈ విషాద ఘటనలు పలువురితో కన్నీరు పెట్టిస్తున్నాయి. అయితే కృష్ణ హఠాన్మరణం సందర్భంగా కృష్ణ ఆస్తులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణా తన ఆస్తులు మనవళ్లు, మనవరాళ్లకు చెందేలా వీలునామా రాశారని సమాచారం. కృష్ణ ఆస్తుల విలువ 400 కోట్ల రూపాయలు కాగా.. దానధర్మాలు చేయడం వల్ల ఆయన ఆస్తుల విలువ తగ్గిందని సమాచారం. ఇక వీకే నరేష్ కు మాత్రం కృష్ణ ఆస్తిలో భాగం ఇవ్వలేదని సమాచారం. నరేష్ కి తల్లి విజయనిర్మల ద్వారా పెద్ద మొత్తంలో ఆస్తి సమకూరిందట. ఈ కారణంగానే నరేష్ కృష్ణ ఆస్తిలో వాటాను ఆశించలేదని సమాచారం. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: ఈ 10 సినిమాలు మన దర్శకులు డైరెక్ట్ చేశారంటే అస్సలు నమ్మరుగా !