Advertisement
టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 28న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. ముఖ్యంగా మొదటి షో నుంచి ఈ చిత్రం మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. సుమారు 80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ టాక్ మాత్రం నెగిటివ్ గా వచ్చింది.
Advertisement
ఈ సినిమా చూసిన ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం అఖిల్ పడ్డ కష్టమంతా వృధా అయ్యిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ కి అభిమానిగా ఉండటం కష్టమైపోతుందని పలువురు ట్వీట్స్ కూడా చేశారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి అమల దగ్గరకు చేరిందని…దీంతో ఆమె అక్కినేని ఫ్యాన్స్ నీ ఉద్దేశిస్తూ ఓ లెటర్ రిలీజ్ చేశారని తెలుస్తోంది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
Advertisement
‘ట్రోలింగ్ అనేది ఎప్పుడూ ఉండేదే. ఎందుకు అలా చేస్తారనేది నేను అర్థం చేసుకున్నాను. నిన్న నేను ఏజెంట్ చూశాను. పూర్తిగా ఎంజాయ్ చేశాను. సినిమాలో లోపాలు ఉన్నాయి. కానీ మీరు ఓపెన్ మైండ్ తో చూస్తే ఆశ్చర్యపోతారు. థియేటర్లో నేను మూవీ చూస్తున్న టైం లో సగం మంది లేడీస్ ఉన్నారు. యాక్షన్ సీన్స్ టైంలో అరుస్తూ కేకలేస్తూ వాళ్ళు బాగానే ఎంజాయ్ చేశారు. నేను ఒకటే చెప్పగలను అఖిల్ తర్వాత చేయబోయే సినిమా ఇంకా బాగుంటుంది’ అని అమల చెప్పుకొచ్చారట.
READ ALSO : ఒక రాష్ట్ర సీఎం నే తెలివిగా బురిడీ కొట్టించిన ఘనుడు ఈయన ! ఎలా సీఎం నే ఎలా మోసం చేసాడంటే ?